Xiaomi Mi 5 లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసిన కంపెని VP

Updated on 25-Jan-2016

Xiaomi మోస్ట్ awaiting అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్, Mi 5 ఈ ఫిబ్రవరి 24 న లాంచ్ కానుంది. ఈ విషయం స్వయంగా కంపెని వైస్ ప్రెసిడెంట్ Wanqiang Li వెల్లడించారు. ఇండియా లాంచ్ ప్లాన్స్ పై ఇన్ఫర్మేషన్ లేదు.

ఆల్రెడీ దీని ముందు మోడల్ Mi 4 బెస్ట్ ఫోన్ గా మంచి మార్కులు సంపాదించింది. కాని కేవలం సింగిల్ సిమ్ అవటం వలన మిగిలిన Xiaomi ఫోన్ల కన్నా ఇది కొంచెం వెనుక బడింది పాపులారిటీ విషయంలో.

అయితే మరి ఈ అప్ కమింగ్ మోడల్ లో ఏమి ఉండనున్నాయో తెలుసుకోవాలని ఉందా?  ఇప్పటి వరకూ వినిపించిన చాలా సోర్సెస్ ప్రకారం దీనిలో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 820 ఉండనుంది.

ఈ ప్రొసెసర్ లేటెస్ట్ అనే కాకుండా క్వాల్ కామ్ మొట్ట మొదటి సారిగా సొంత cores ను కాకుండా custom made Kryo యొక్క కోర్స్ ను వాడటం జరిగింది. ఇప్పటివరకు ARM బేస్డ్ cores ఉండేవి SD లో.

Mi 5 మిగిలిన రూమార్డ్ స్పెక్స్ – 5.2 in 2560×1440 P డిస్ప్లే, 4GB ర్యామ్, 16GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్స్, 16MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 3600 mah బ్యాటరీ

మరొక హై లైట్ రూమర్ ఏంటంటే ఈ సారి కంపెని ఈ ఫ్లాగ్ షిప్ మోడల్ ను డ్యూయల్ సిమ్ capabilities తో విడుదల చేస్తుంది. 4G LTE ఇంటర్నెట్ కనెక్టివిటి, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో MIUI 7 OS పై రన్ అవనుంది.

Xiaomi Mi 4i కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడండి.. లిమిటెడ్ స్టోరేజ్ అనే మైనస్ మినహా ఇది బెస్ట్ మొబైల్.

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :