xiaomi నుండి మరొక కొత్త మోడల్ వస్తుంది. దీని పేరు Mi 4C. JetaimeTech అనే వ్యక్తి ద్వారా ట్విటర్ లో దీనికి సంబందించిన బాక్స్ ఇమేజ్ లీక్ అయ్యింది ఇంటర్నెట్ లో.
తాజా లీక్ వలన Mi 4C లో usb టైప్ c పోర్ట్ ఉంటుంది అని తెలిసింది. ఇది ఫస్ట్ xiaomi usb టైప్ c పోర్ట్ మొబైల్ ఫోన్.usb type c పోర్ట్ అనేది HDMI(టి.వి) , VGA( మానిటర్స్ ), డిస్ప్లే పోర్ట్ మరియు ఇతర కనెక్షన్ లను సింగిల్ పోర్ట్ ద్వారా అందిస్తుంది.
Mi 4C స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే గతంలోనే TENAA నుండి లీక్ అయ్యాయి. స్నాప్ డ్రాగన్ 1.8GHz 808 ప్రొసెసర్, 2gb ర్యామ్, ఫుల్ HD 5in స్క్రీన్ మొబైల్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP మరియు 5MP కేమేరాస్
అలాగే తాజాగా లాంచ్ అయిన ఆండ్రాయిడ్ లలిపాప్ బేస్డ్, MIUI 7 కొత్త మొబైల్ os వెర్షన్ దీనితో పాటు వస్తుంది అని రిపోర్ట్స్. దీని ధర 13,533 రూ ఉంటుంది అని అంచనా.
సెప్టెంబర్ 24 న Mi 4C మోడల్ అనౌన్స్ మరియు అక్టోబర్ 3 న మార్కెట్ లో కొనటానికి available అవుతుంది అని xiaomi Today వెల్లడించింది.
కేవలం Mi 5 మోడల్ వచ్చే వరకూ Mi 4C గ్యాప్ ను Fill అప్ చేయటానికి రిలీజ్ అవుతుంది. సో కేవలం 1,00,000 యూనిట్లు మాత్రమే సేల్ అవనున్నాయి. Mi 5 మోడల్ మాత్రం ఎప్పుడూ వస్తుంది అనే సమాచారం లేదు.