సెప్టెంబర్ 22 న xiaomi కో ఫౌండర్, Lin Bin కొత్త మోడల్ Mi 4C ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు ఈ రోజు. ఇది 2gb ర్యామ్ – 16gb స్టోరేజ్ మరియు 3gb ర్యామ్ – 32gb స్టోరేజ్ ఆప్షన్స్ లో వస్తుంది.
గత నెలలో TENAA ద్వారా మి 4c ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యి బాగా హల చల్ చేసాయి. ఇమేజెస్ తో పాటు 1.4GHz hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 SoC, 5 in FHD డిస్ప్లే, 2gb ర్యామ్, 16gb స్టోరేజ్, 13mp – 5mp కేమేరాస్ ఉంటాయని రిపోర్ట్ చేసింది TENAA ఆన్ లైన్ వెబ్ సైట్.
ఈ నెల ఆరంభంలో మరోసారి, మి 4C ఫోన్ యొక్క రిటేల్ బాక్స్ పిక్స్ లీక్ అయ్యాయి. దానితో TENAA గతంలో చెప్పిన స్పెక్స్ నిజమని కొంత రుజువు అయ్యింది. దీనిలో usb టైప్ c పోర్ట్ అండ్ 3080 mah బ్యాటరీ కూడా ఉన్నట్లు కనిపించింది.
ఇది కాక xiaomi లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్, మి 5 ను కూడా త్వరలో లాంచ్ చేయనుంది. దీనిలో 4gb ర్యామ్, క్వాడ్ HD 5.3 in డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియా టెక్ Helio x20 ప్రొసెసర్ వంటి స్పెక్స్ ఉంటాయని రూమర్స్.