Xiaomi ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ పై కొత్త అనౌన్స్మెంట్

Updated on 30-Dec-2015

Xiaomi ఆండ్రాయిడ్ 6.0 – మార్ష్ మల్లో అప్ డేట్ ఇవనుంది మొబైల్స్ కు. ప్రస్తుతం మి 4 , మి నోట్ అండ్ మి 3 లపై ఫైనల్ టెస్టింగ్స్ చేస్తుంది. 

ఈ విషయం కంపెని ఆపరేషన్స్ మేనేజర్ తెలిపారు. అతను పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం అప్ డేట్ సైజ్ 518MB. అలాగే MIUI ఇంటర్ఫేస్ లో మాత్రం కొత్త మార్పులు లేవు. 

ప్రసుత MIUI వెర్షన్ 7. పైన కంపెని పైన చెప్పిన మూడు మోడల్స్ లో బీటా టెస్టింగ్స్ జరుపుతున్నట్టు చెప్పింది. సో మిగిలిన ఫోన్స్ లో మార్ష్ మల్లో వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు.

మరి కొన్ని నెలలో అప్ డేట్ స్టేబుల్ గా బయటకు రానుంది. ఆండ్రాయిడ్ 6.0 అక్టోబర్ 2015 లో రిలీజ్ అయ్యింది. ఇండియాలో ఆండ్రాయిడ్ one మరియు హానర్ 7 కు ఇది ముందుగా రోల్ అయ్యింది.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :