Redmi Note 12 Series: రేపు లాంచ్ అవుతున్న ఈ కొత్త ఫోన్ల ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.!

Updated on 04-Jan-2023
HIGHLIGHTS

Redmi Note 12 Series నుండి మూడు కొత్త ఫోన్లు వస్తున్నాయి

రేపు Redmi Note 12 Series లాంచ్ కోసం సర్వం సన్నద్ధం

ఈ అప్ కమింగ్ ఫోన్ల కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది

Redmi Note 12 Series నుండి మూడు కొత్త ఫోన్లను రేపు ఇండియాలో లాంచ్ చెయ్యడానికి షియోమి సర్వం సన్నద్ధం చేసింది. రెడ్ మి నోట్ 12 సిరీస్ నుండి మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. వీటిలో, Redmi Note 12 5G, Note 12 Pro 5G మరియు Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్లు వున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ల యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా టీజింగ్ ద్వారా వెల్లడించింది. రెడ్ మి నోట్ 12 సిరీస్ నుండి వస్తున్న ఈ మూడు ఫోన్ల స్పెక్స్ (టీజింగ్) మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేయండి. 

షియోమి హోమ్ పేజ్ mi.com నుండి అందించిన టీజర్ నుండి ఈ సిరీస్ నుండి Redmi Note 12 5G, Note 12 Pro 5G మరియు Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్లు రేపు లాంచ్ చేస్తున్నట్లు చెబుతోంది. వీటిలో, రెడ్ మి నోట్ 12 5G బేసిక్ ఫోన్ కాగా నోట్ 12 ప్రో 5G మీడియం వేరియంట్ మరియు నోట్ 12 ప్రో+ 5G ఈ సిరీస్ లో హై ఎండ్ వేరియంట్ ఫోన్ అవుతుంది. అంటే, ఫోన్ పేర్లు సూచిస్తునట్లుగా వీటి ధరలు మరియు స్పెక్స్ ఉంటాయి. 

Redmi Note 12 5G: స్పెక్స్ (టీజింగ్)

ఈ స్మార్ట్ ఫోన్ ను Super AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ 5G చిప్ సెట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 48MP మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. దీని ధర బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉండవచ్చు. 

Redmi Note 12 Pro 5G: స్పెక్స్ (టీజింగ్)

రెడ్ మి నోట్ 12 ప్రో 5G టీజింగ్ ద్వారా, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ తో కలిగివుంటుంది. అంతేకాదు, ఆడియో పరంగా Dolby Atmos సపోర్ట్ మరియు వేగవంతమైన మీడియాటెక్ 5G చిప్ సెట్ Dimensity 1080 వంటి స్పెక్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ లో 50MP 50MP Sony IMX766 మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది.

Redmi Note 12 Pro+ 5G: స్పెక్స్ (టీజింగ్)

రెడ్ మి నోట్ 12 ప్రో+ 5G ఫోన్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ తో కలిగివుంటుంది. అంతేకాదు, ఆడియో పరంగా Dolby Atmos సపోర్ట్ మరియు వేగవంతమైన మీడియాటెక్ 5G చిప్ సెట్ Dimensity 1080 వంటి స్పెక్స్ తో ఉంటుందని టీజింగ్ చెబుతోంది. ఈ ఫోన్ లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది మరియు భారీ 200MP మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :