రేపు విడుదలకు సిద్దమైన Redmi 11 Prime మరియు Redmi A1

Updated on 05-Sep-2022
HIGHLIGHTS

షియోమీ రేపు ఇండియాలో మూడు కొత్త ఫోన్లను విడుదల చేయనున్నట్లు

Redmi A1 మరియు Redmi 11 Prime సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది

ఎంట్రీ లెవల్ మొదలుకొని బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ లో కూడా ఈ ఫోన్లు ఉండవచ్చు

షియోమీ రేపు ఇండియాలో కొత్త ఫోన్లను విడుదల చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. షియోమీ రేపు ఇండియాలో మూడు కొత్త ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో, Redmi A1 స్మార్ట్ ఫోన్ మరియు Redmi 11 Prime సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనునట్లు టీజింగ్ ద్వారా వెల్లడించింది. అంటే, ఎంట్రీ లెవల్ మొదలుకొని బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ లో కూడా ఈ ఫోన్లు ఉండవచ్చు. ఈ మూడు ఫోన్లలో 5G వేరియంట్ కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.      

ఇక రెడ్ మి గురించి వెల్లడించిన మరిన్నిఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ లెదర్ లుక్ బ్యాక్ ప్యానల్ లో కనిపిస్తోంది మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు చూపే చిత్రాలను అందించింది. అంతేకాదు, Redmi A1 పెద్ద 5,000 mAh బ్యాటరీని కూడా కలిగివున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, స్కై బ్లూ మరియు గ్రీన్ మూడు కలర్ లలో కనిపిస్తోంది.

ఇక Redmi 11 Prime సిరీస్ నుండి లాంచ్ చేయనున్నట్లు చెబుతున్న మిగిలిన రెండు ఫోన్ల కీ స్పెక్స్ ను కూడా షియోమీ టీజింగ్ చేస్తోంది. వీటిలో ఒక ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాతో కనిపిస్తుండగా, మరోకటి డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్ల డిజైన్ లో కూడా చాలా మార్పులు వున్నాయి. ఈ రెండు ఫోన్లలో ఒక 5G ఫోన్ అవుతుంది మరియు ఆ ఫోన్ మీడియాటెక్ Dimensity 700 5G చిప్ సెట్ తో పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :