Redmi 13C: ఆకర్షణీయమైన డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న Xiaomi
Xiaomi కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది
Redmi 13C పేరుతో లాంచ్ చేస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది
అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది
Xiaomi కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది. Redmi 13C పేరుతో తీసుకు వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 6వ తేదీకి లాంచ్ చేస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు 50MP కెమేరా వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు చూడవచ్చు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన వివరాలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
Xiaomi Redmi 13C teased specs
డిసెంబర్ 6న షియోమి లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించిన రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. ఈ పేజ్ నుండి రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఎందుకంటే, రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ ను Amazon Special గా తీసుకు వస్తోంది అమేజాన్.
అమేజాన్ అందించింది రెడ్ మి 13సి స్మార్ట్ ఫోన్ టీజర్ ప్రకారం, ఈ ఫోన్ సన్నని మరియు అందమైన డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను స్టార్ డస్ట్ బ్లాక్ మరియు స్టార్ షైన్ గ్రీన్ రెండు కలర్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో 50MP AI మెయిన్ కెమేరా ఉన్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది.
Also Read : iQOO 12 5G: స్టన్నింగ్ కెమేరా మరియు సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
ఈ ఫోన్ రైట్ సైడ్ లో వాల్యూమ్ బటన్స్ మరియు పవర్ బటన్ ఉన్నాయి. అలాగే, ఫోన్ పై భాగంలో 3.5mm జాక్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతానికి షియోమి ఈ వివరాలను మాత్రమే అందించింది. అయితే, ఈ ఫోన్ బడ్జెట్ సిరీస్ నుండి వస్తున్న ఫోన్ కాబట్టి ఇందులో బిగ్ బ్యాటరీ, బడ్జెట్ చిప్ సెట్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు.