Xiaomi చైనాలో రెడ్మి note 3 కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. దీనిలో కొత్తగా స్నాప్ డ్రాగన్ 650 SoC ఉంది. గతంలో నవంబర్ నెలలో మీడియా టెక్ Helio X10 SoC తో కంపెని మొదటి రెడ్మి note 3 వేరియంట్ ను లాంచ్ చేసింది.
మీడియా టెక్ ప్రొసెసర్ డివైజ్ ఇండియాలో మాత్రం ఇంకా రాలేదు కాని ఇప్పుడు చైనా లో రిలీజ్ అయిన స్నాప్ డ్రాగన్ వేరియంట్ రెడ్మి నోట్ 3 ఇండియాలో కూడా రిలీజ్ అవనుంది త్వరలో. (నిన్న కంపెని అనౌన్స్ చేస్తా అన్న వండర్ ఫుల్ అనౌన్సుమెంటు ఇదే.)
కంపెని అఫీషియల్ గా ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే స్పష్టంగా డేట్ మాత్రం వెల్లడించలేదు. రెడ్మి నోట్ 3 స్నాప్ డ్రాగన్ వేరియంట్ ధర 10,100 ఉంటుంది చైనా రేట్ కన్వర్షన్ ప్రకారం.
వచ్చే ఆదివారం నుండి ఇది చైనా లో సెల్ అవనుంది. ఇంచుమించు మొదటి వేరియంట్ కు దీనికి సేమ్ హార్డ్ వేర్ స్పెక్స్ ఉన్నాయి. కేవలం కెమెరా(16MP) మరియు పైన చెప్పినట్టు SoC తేడాలు.
కొత్త వేరియంట్ లో ఉన్న SD 650 SoC ను గతంలో SD 618 SoC అనే వారు. SD 650 ప్రొసెసర్ కొత్త వేరియంట్ మరలా 16/32GB స్టోరేజ్ అండ్ 2GB/3GB ర్యామ్ ఆప్షన్స్ లో వస్తుంది.
టోటల్ అన్ని రెడ్మి నోట్ 3 వేరియంట్స్ లో 5.5 in ఫుల్ HD – 178 డిగ్రీ వ్యూయింగ్ angle డిస్ప్లే, MIUI 7 layered ఆండ్రాయిడ్ లాలిపాప్ os, 4G , డ్యూయల్ సిమ్ స్లాట్స్, 4000 mah బ్యాటరీ ఉన్నాయి.
ఆటో phase డిటెక్షన్ ఆటో ఫోకస్ అండ్ డ్యూయల్ led ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, మెటల్ బిల్డ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 164 గ్రా బరువు కలిగి ఉంది.