Xiaomi నుంచి కొత్త డివైస్ , కాస్ట్ Rs 799

Xiaomi నుంచి కొత్త డివైస్ , కాస్ట్ Rs 799

Xiaomi  భారత్ లో కొత్త మి పవర్ బ్యాంక్ 2I ప్రారంభించింది . రెండిటి కెపాసిటీ  10000mAh మరియు 20000mAh . ఈ పవర్ బ్యాంక్స్ ఇండియా లో తయారు చేయబడ్డాయి .  ఈ పవర్ బ్యాంక్ Hipad యొక్క  భాగస్వామ్యంతో నోయిడాలోని కంపెనీ యొక్క మొదటి అనుబంధ తయారీ కేంద్రంలో నిర్మించబడింది.10000mAh Mi Power Bank 2i  ధర రూ 799 ,20000mAh కెపాసిటీ గల వేరియంట్ ధర  రూ 1,499  మరియు ఈ పవర్ బ్యాంక్స్ నవంబర్ 23 నుండి ఆన్లైన్ రిటైలర్స్ వద్ద అందుబాటులో ఉంటాయి.

మరియు డిసెంబర్ నుండి ఆఫ్లైన్ దుకాణాలలో అందుబాటులో ఉంటాయి.

10000mAh పవర్ బ్యాంక్  డ్యూయల్  USB అవుట్పుట్ కి సపోర్ట్ . 20000mAh కెపాసిటీ  కలిగిన పవర్ బ్యాంక్ సింగిల్ USB పోర్ట్ ద్వారా ఛార్జింగ్ సమయంలో క్విక్ ఛార్జ్ 3.0 కి  మద్దతు ఇస్తుంది. 20000mAh పవర్బ్యాంక్  ఒక స్క్రాచ్ రెసిస్టెంట్ , 10000mAh పవర్బ్యాంక్ యానోడైజ్డ్ అల్యూమినియం అల్లోయ్  కేసులో వస్తుంది.ఈ10000mAh మరియు 20,000mAh Mi పవర్ బ్యాంక్ 2i యొక్క వాస్తవ కెపాసిటీ  వరుసగా 6500mAh మరియు 13000mAh. 10000mAh పవర్బ్యాంక్ 85% కన్వర్షన్ రేట్ తో 5V / 2A, 9V / 2A మరియు 12V / 1.5A ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది , 20,000 mAh పవర్బ్యాంకు 93% కన్వర్షన్ రేట్ తో   5V / 2.4A, 9V / 2A మరియు 12V / 1.5A చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది .

అదనంగా, ఈ కొత్త పవర్ బ్యాంకులో పవర్ బటన్ ని  రెండుసార్లు నొక్కడం వలన "లో పవర్ మోడ్" యాక్టివేట్  చేస్తుంది, దీని వలన Mi Band  మరియు mi  బ్లూటూత్ హెడ్సెట్లను ఛార్జ్ చేయవచ్చు.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo