Xiaomi చైనా కంపెని కు పరిచయం మాటలు అవసరం లేదు. ఇప్పుడు ఈ కంపెని 199 రూ లకు Mi LED లైట్స్ ను ఇండియాలో లాంచ్ చేసింది. అఫీషియల్ Mi.com వెబ్ సైటు నుండి ఇవి సేల్ అవనున్నాయి.
ఇంతకీ దీని అవసరం ఏంటి?
USB సోర్స్ కేబుల్ ద్వారా లాప్టాప్ లేదా usb ప్లగ్ పాయిట్ కు కనెక్ట్ చేసి లో లైట్ అవసరం ఉండే సందర్భాల్లో ఉపయోగించ వచ్చు. ప్రధానంగా లాప్టాప్ ను నైట్ టైమ్ వాడుకునేటప్పుడు జస్ట్ లాప్టాప్ usb పోర్ట్ కు కనెక్ట్ చేసి వాడుకోవటానికి ఇది. ఫ్లేక్సిబిల్ కార్డ్ తో స్టైలిష్ గా సింపుల్ గా ఉండనుంది. వైట్ మరియు బ్లూ కలర్స్ లో వస్తున్న ఇది లైట్ గ్లేరింగ్ ను ఇవ్వదు అని చెబుతుంది కంపెని. మీకు నచ్చిన ఏంగిల్ లో దీనిని బెండ్ చేసుకొని వాడుకోవచ్చు.
అయితే led పరికరాలు ఇండియాలో ఉన్నాయి. చైనా లో కూడా ఇది ఎప్పుడో లాంచ్ చేసింది Xiaomi. అమెజాన్ వంటి సైట్లలో కూడా ఇది సేల్ అవుతుంది. కాని అఫీషియల్ గా Xiaomi ఇప్పుడు లాంచ్ చేసింది ఇండియా లో. తాజాగా Xiaomi మి 4 మోడల్ ను మొదటిగా లాంచ్ చేసినప్పటి ప్రైస్ నుండి 4 వేలు తగ్గించింది.