రెడ్మి నోట్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ లో చాలా సార్లు రూమర్స్ గా వినిపించింది ఇంతవరకూ. ఇప్పుడు ఇది అఫిషియల్ గా xiaomi కో ఫౌండర్, Bin Lin నుండి unveil అయ్యింది.
Weibo సైట్ లో కంపెని రెడ్మి నోట్ 2 ప్రో మోడల్ యొక్క టీసర్ పోస్ట్ చేసింది. దీనిలో బ్యాక్ కెమేరా అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది ఎప్పుడూ రిలీజ్ అవుతుంది, ఎంత కాస్ట్ ఉంటుంది అనేది ఇంకా స్పష్టత లేదు.
ఫోన్ మెటాలిక్ డిజైన్ తో బిల్డ్ అయినట్లు చూపిస్తుంది ఇమేజ్. అయితే చైనా లో చాలా బ్రాండ్స్ మెటాలిక్ డిజైన్ తో వస్తున్నాయి.
in fact రీసెంట్ గా చైనా లో లాంచ్ Le 1s స్మార్ట్ ఫోన్ లుక్స్ తో ఉంది రెడ్మి నోట్ 2 ప్రో. సర్కులర్ కెమేరా లెన్స్, డ్యూయల్ టోన్ led ఫ్లాష్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకదాని క్రింద ఒకటి ఉన్నాయి.
ఆధారం – Weibo