షియోమీ బ్లాక్ షార్క్ 2 డ్యూయల్ – రియర్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్లతో TENAA లో దర్శనమిచ్చింది

షియోమీ బ్లాక్ షార్క్ 2 డ్యూయల్ – రియర్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్లతో TENAA లో దర్శనమిచ్చింది
HIGHLIGHTS

జాబితా ప్రకారం, షియోమీ బ్లాక్ షార్క్ 2 స్మార్ట్ఫోన్ ఒక 5.99-అంగుళాల డిస్ప్లే మరియు ఒక పెద్ద 4000mAh బ్యాటరీ కలిగి ఉంది.

షియోమీ ఈ సంవత్సరం ఏప్రిల్ లో, దాని మొదటి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ఫోన్నీ ప్రారంభించింది, అదే బ్లాక్ షార్క్. ఈ హ్యాండ్ సెట్ ఇప్పటికీ విడుదల చేయబడుతోంది, అయితే TENAA లిస్టింగ్ ప్రకారం, కంపెనీ ఇప్పటికే మరో డివైజ్ మీద పనిచేస్తున్నట్లు స్లాష్లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ జాబితా రాబోయే డివైజ్ని   తెలుపుతుంది, కానీ హ్యాండ్సెట్ యొక్క స్క్రీన్ సైజు, బ్యాటరీ సామర్థ్యం మరియు పరిమాణాల మినహా నిర్దిష్ట వివరాల విషయంలో చాలా ఎక్కువగా వివరణ లేదు. ఈ జాబితా ప్రకారం, దాని పూర్వీకుడిగా ఉన్న బ్లాక్ షార్క్ 2 ఒక 5.99-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది మరియు ఇది 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, ఇది 160 mm x 175.26mm x 8.7mm పరిమాణాలతో కొంచం మందంగా ఉంటుంది.

ప్రస్తుత బ్లాక్ షార్క్ స్మార్ట్ఫోన్, సమాంతరంగా అమర్చబడిన ఒక వెనుక కెమెరా సెటప్ను కలిగి ఉంది, అయితే, కొత్త బ్లాక్ షార్క్ ఫోన్ తిరిగి నిలువుగా పేర్చబడిన కెమెరాలో ఉంది. అలాగే, ఈ సమయంలో వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. గేమింగ్ సమయంలో డివైజ్ యొక్క పనితీరును పెంచడానికి ఒక డేడికేటెడ్ కీ ని ఎడమ వైపున ఇచ్చారు, ఫోన్ యొక్క కుడి అంచున వాల్యూమ్ మరియు పవర్ బటన్లను చూడవచ్చు. ఫోన్ యొక్క డిస్ప్లే దాని మునుపటి వాటితో పోలిస్తే, సన్నగా bezels కలిగి ముందు కెమెరా కలిగివుంది.

చైనా లో షియోమీ యొక్క బ్లాక్ షార్క్ RMB 2,999 (రూపాయలు 31,200 సుమారు) ప్రారంభ ధర వద్ద  ప్రారంభించబడింది . ఇది Razer ఫోన్ మరియు ASUS ROG  మొబైల్ ఫోన్ గేమర్స్ ని తనవైపు మరల్చే లక్ష్యంతో ఉద్దేశించబడింది. షియోమీ బ్లాక్ షార్క్ ఒక ద్రవ శీతలీకరణ వ్యవస్థతో వస్తుంది, వేరు చేయగలిగిన gamepad మరియు ఇంకా మరింన్నింటితో. ఇది ఒక 5.99 అంగుళాల పూర్తి HD + IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది మరియు స్నాప్డ్రాగెన్ 845 SoC తో 64GB  మరియు 128GB అంతర్గత స్టోరేజి రకాలైన 6GB మరియు 8GB RAM తో పనిచేస్తుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 12 MP f / 1.75 + 20 MP f / 1.75 6P లెన్స్తో మరియు డ్యూయల్ – LED ఫ్లాష్. ప్రాధమిక సెన్సార్ 1.25um పిక్సెల్ పరిమాణం కలిగివుండగా, సెకండరీ సెన్సార్ 1um సెన్సార్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ముందు F / 2.2 ఎపర్చరుతో 20-మెగాపిక్సెల్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo