త్వరలో రెడ్మి నోట్ 7 భారత దేశంలో విడుదలకానున్నదని షావోమి ఇండియా మరియు రెడ్మి ఇండియా, 48MP కెమేరాతో కూడిన ఈ రెడ్మి నోట్ 7 ఇండియా లాంచ్ గురించి తమ Instagram మరియు Twitter లలో టీజ్ చేసాయి. ఇప్పుడు, మరొకసారి మరో టీజ్ తో ఈ ఫోన్ త్వరలో రానున్నట్లు చెబుతోంది కంపెనీ. ఈ రెండు టీజ్ లలో కూడా క్యాప్షన్ గా "48MP" ని ప్రచురించారు, అంటే అది 48MP కెమేరాతో కూడిన ఈ రెడ్మి నోట్ 7 గురించే వివరిస్తుంది.
ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్నీ VP మనూ జైన్ మరియు MD, CEO అయిన లీ జూన్ పట్టుకున్నట్లు చూపిస్తున్న ఫోటోనీ, తల్ల క్రిందులుగా పోస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చిన మరొక టీజ్ లో కూడా 48 నంబరును తలక్రిందులుగా చూపించారు మరియు దాని క్రింద Good Things Come To Who Wait అని వ్రాసారు. ఒకవేళ,ఇదే నిజమైతే ఉప బ్రాండ్ గా అవతరించిన తరువాత, ఈ సంస్థ ఇండియాలో అందిస్తున్న మొదటి ఫోన్ ఇదే అవుతుంది.
రెడ్మి నోట్ 7 ప్రత్యేకతలు
డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఈ రెడ్మి నోట్ 7, 2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల LCD ప్యానెల్ తోవస్తుంది. ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC కి జతగా 3GB, 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 32GB లేదా 64GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
https://twitter.com/XiaomiIndia/status/1090180332597465088?ref_src=twsrc%5Etfw
పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా 5MP సెకండరీ సెన్సారుతో కలిపి 48MP సెన్సారు కలిగిన మొదటి Redmi ఫోన్ ఇది. ఈ నోట్ 7 యొక్క 48MP సెన్సార్ తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ 48MP కెమెరా సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సోనీ సంస్థ వెల్లడించింది. ఇందులో అతితక్కువ 0.8um అంగుళాల పిక్సెళ్ళు నిజంగా బాగుంటుంది, కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. Xiaomi ప్రకారం, Redmi Note 7 పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని చెబుతోంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.