Redmi Note 14 Series ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన షియోమీ.!
Redmi Note 14 Series లాంచ్ డేట్ ను షియోమీ అనౌన్స్ చేసింది
రెడ్ మీ 13 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను తీసుకు వస్తోంది
ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ అర్ధమయ్యేలా హింట్ ఇస్తూ టీజింగ్ మొదలు పెట్టింది
Redmi Note 14 Series లాంచ్ డేట్ ను షియోమీ అనౌన్స్ చేసింది. రెడ్ మీ 13 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను తీసుకు వస్తోంది. రెడ్ మీ నోట్ 14 సిరీస్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ అర్ధమయ్యేలా హింట్ ఇస్తూ టీజింగ్ మొదలు పెట్టింది.
Redmi Note 14 Series : లాంచ్ డేట్
రెడ్ మీ నోట్ 14 సిరీస్ ను డిసెంబర్ 9వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. సూపర్ కెమెరా మరియు సూపర్ AI క్యాప్షన్ తో ఈ ఫోన్ ను తీజ్ చేస్తోంది. అంటే, ఫోన్ ను కెమెరా మరియు AI యొక్క ప్రత్యేకమైన ఫీచర్స్ తీసుకు వస్తుందని హింట్ ఇచ్చింది.
Redmi Note 14 Series : అంచనా ఫీచర్స్
రెడ్ మీ నోట్ 14 సిరీస్ కోసం షియోమీ అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. అవేమిటంటే, ఈ ఫోన్ ను అందరిని ఆకర్షించే సరికొత్త డిజైన్ తో అందిస్తుందట. ఈ ఫోన్ లో అందించిన పెద్ద కెమెరా రింగ్ తో ఈ ఫోన్ టీజింగ్ ను షియోమీ అందించింది.
రెడ్ మీ నోట్ 14 సిరీస్ లో గొప్ప కెమెరా సెటప్ ను అందుకుంటారని రెడ్ మీ టీజ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ AI సత్తా కలిగి ఉంటుంది మరియు గొప్ప AI ఫీచర్స్ తో కూడా వస్తుంది. అంటే, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ మరియు AI కేపబిలిటీస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఫోన్ ను చాలా స్ట్రాంగ్ బిల్డ్ తో చాలా గట్టిగా ఉండేలా అందిస్తున్నట్లు షియోమీ తెలిపింది. ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ సిరీస్ గురించి ఈ విషయాలు మాత్రమే బయటపెట్టింది.
Also Read: OPPO Find X8 Pro లాంచ్ తో ప్రీమియం సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన ఒప్పో.!
అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో 50MP పవర్ ఫుల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, లేటెస్ట్ చిప్ సెట్, బిగ్ స్టోరేజ్, బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను త్వరలోనే అందించే అవకాశం ఉంటుంది.