Xiaomi 14 Ultra: షియోమి అప్ కమింగ్ ఫోన్ అంచనా ధర మరియు ఫీచర్స్ పైన లుక్కేయండి.!
Xiaomi 14 Ultra అంచనా ధర మరియు ఫీచర్స్ ను ట్విట్టర్ లో దర్శనమిచ్చాయి
షియోమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న షియోమి 14 అల్ట్రా
బార్సిలోనా లో జరగనున్న MWC 2024 నుండి ఆవిష్కరిస్తునట్లు కంపెనీ అనౌన్స్
Xiaomi 14 Ultra: షియోమి అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమి 12 అల్ట్రా అంచనా ధర మరియు ఫీచర్స్ ను ట్విట్టర్ లో దర్శన మిచ్చాయి. షియోమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ ను అఫీషియల్ గానే బయటపెట్టింది. అయితే, ఈ ఫీచర్స్ తో పాటుగా మరికొన్ని ఫీచర్స్ మరియు అంచనా ధరలను మాత్రం ప్రముఖ లీక్స్టార్ సంజూ చౌదరి తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు.
Xiaomi 14 Ultra:
షియోమి 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసింది షియోమి. ఈ నెల 26 నుండి 29 వరకూ స్పెయిన్ లోని బార్సిలోనా లో జరగనున్న MWC 2024 నుండి ఆవిష్కరిస్తునట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. Founder and CEO of Xiaomi, లీ జున్ తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ ఫోన్ లాంఛ్ మరియు కొన్ని కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టారు.
అయితే, ప్రముఖ లీక్స్టార్ సంజు చౌదరి ఈ ఫోన్ యొక్క అంచనా ధర మరియు కలిగి ఉండనున్నట్లు చెబుతున్న అంచనా స్పెక్స్ తో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, ఈ ఫోన్ 6.73 ఇంచ్ OLED LTPO డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను షియోమి సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో తీసుకు వస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ప్రొసెసర ని లాగి ఉంటుందని ఈ ట్వీట్ లో వెల్లడించారు.
అలాగే, 90W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,300mAh బిగ్ బ్యాటరీ, IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ మరియు నాలుగు 50MP కెమేరా రియర్ కెమేరా సెటప్ ఉంటుందని కూడా తెలిపారు. అయితే, ఇవన్నీ కూడా అంచనా స్పెక్స్ మాత్రమే అని, ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకూ బయటకు రాలేదని ట్వీట్ అడుగున నోట్ ను కూడా అందించారు.
దీనితో పాటుగా ఈ ఫోన్ అంచనా ధరలను కూడా వెల్లడించారు. ఈ ఫోన్ ను చైనాలో Yuan ¥6499 ధరతో, యూరప్ లో €1499 యూరో మరియి ఇండియాలో ₹94,999 ధరతో లాంఛ్ చేయవచ్చని అంచనా వేసి చెబుతున్నారు.
షియోమి 14 అల్ట్రా టీజ్డ్ స్పెక్స్
ఇక షియోమి 14 అల్ట్రా టీజ్డ్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 75mm ఫ్లోటింగ్ మరియు 120mm periscope కలిగిన Leica డ్యూయల్ టెలిఫోటో లెన్స్ లు ఉన్నట్లు టీజింగ్ ద్వారా తెలిపింది. అంతేకాదు, ఈ రెండు లెన్స్ లు కూడా Sony IMX858 సెన్సార్ తో ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ ని వివరించే టీజింగ్ ఇమేజ్ లను కూడా షియోమి విడుదల చేసింది.