Xiaomi 14: ప్రముఖ చైనీస్ బ్రాండ్ షియోమి మరొక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తోంది. అదే, షియోమి 14 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో తీసుకు వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 7వ తేదీ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ముందుగా చైనా మార్కెట్ లో విడుదలై మంచి అమ్మకాలను సాధించిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా అడుగుపెడుతోంది.
షియోమి 14 స్మార్ట్ ఫోన్ ను మార్చి 7వ తేదీ ఈ ఫోన్ ను ఇండియాలో లాంఛ్ చేయడానికి డేట్ ప్రకటించింది. ఈ షియోమీ ఫ్లాగ్ షిప్ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించి, దాని ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, షియోమి 14 స్మార్ట్ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా ఇకామ్ సేల్ పార్ట్నర్ అని కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ లాంఛ్ కంటే ముందే వెల్లడించింది.
Also Read: Air Cooler Deals: ఈ వేసవి కాలం కోసం కొత్త కూలర్ కొనాలని చూస్తున్నారా.!
షియోమి 14 స్మార్ట్ ఫోన్ ను కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో షియోమి మరియు లైకా కలిసి కట్టుగా జతగా తీసుకు వచ్చిన న్యూ జెనరేషన్ Summilux Optical Lens ఈ ఫన్ అందించి నాట్లు తెలిపింది. షియోమి 14 ఫోన్ Snapdragon 8 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు Hyper OS తో నడుస్తుంది. ఈ ఫోన్ లో మంచి విజువల్స్ అందించగల LPTO AMOLED డిస్ప్లేని 1.5 రిజల్యూషన్ తో తీసుకు వస్తోంది.
ఈ షియోమి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ ని భారీ ఫీచర్స్ తో కలిగి ఉన్నట్లు షియోమి చెబుతోంది. ఈ ఫోన్ లో Leica 75mm ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్, లైట్ ఫ్యూజన్ 900 ఇమేజ్ సెన్సార్ మరియు Leica 115 డిగ్రీ అల్ట్రా వైడ్ లెన్స్ జత కలిసిన ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా సెటప్ తో అద్భుతమైన ఫోటొలు మరియు వీడియో లను చిత్రీకరించ వచ్చని కూడా షోయోమి చెబుతోంది.
షియోమి 14 స్మార్ట్ ఫోన్ Dolby Vison మరియు Dolby Atmos సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ఎక్కువ కాలం మన్నిక కోసం IP68 వాటర్ & డస్ట్ ప్రూఫ్ తో కూడా వస్తుంది.