Xiaomi 14: కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో లాంఛ్ అవుతోంది.!

Xiaomi 14: కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో లాంఛ్ అవుతోంది.!
HIGHLIGHTS

షియోమి మరొక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తోంది

Xiaomi 14 ఫోన్ ను కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో తీసుకు వస్తోంది

షియోమి 14 ఫోన్ Snapdragon 8 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది

Xiaomi 14: ప్రముఖ చైనీస్ బ్రాండ్ షియోమి మరొక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తోంది. అదే, షియోమి 14 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో తీసుకు వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 7వ తేదీ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ముందుగా చైనా మార్కెట్ లో విడుదలై మంచి అమ్మకాలను సాధించిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా అడుగుపెడుతోంది.

Xiaomi 14 Launch

షియోమి 14 స్మార్ట్ ఫోన్ ను మార్చి 7వ తేదీ ఈ ఫోన్ ను ఇండియాలో లాంఛ్ చేయడానికి డేట్ ప్రకటించింది. ఈ షియోమీ ఫ్లాగ్ షిప్ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించి, దాని ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, షియోమి 14 స్మార్ట్ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా ఇకామ్ సేల్ పార్ట్నర్ అని కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ లాంఛ్ కంటే ముందే వెల్లడించింది.

Also Read: Air Cooler Deals: ఈ వేసవి కాలం కోసం కొత్త కూలర్ కొనాలని చూస్తున్నారా.!

షియోమి 14 టీజ్డ్ స్పెక్స్ & ఫీచర్స్

షియోమి 14 స్మార్ట్ ఫోన్ ను కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో షియోమి మరియు లైకా కలిసి కట్టుగా జతగా తీసుకు వచ్చిన న్యూ జెనరేషన్ Summilux Optical Lens ఈ ఫన్ అందించి నాట్లు తెలిపింది. షియోమి 14 ఫోన్ Snapdragon 8 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు Hyper OS తో నడుస్తుంది. ఈ ఫోన్ లో మంచి విజువల్స్ అందించగల LPTO AMOLED డిస్ప్లేని 1.5 రిజల్యూషన్ తో తీసుకు వస్తోంది.

ఈ షియోమి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ ని భారీ ఫీచర్స్ తో కలిగి ఉన్నట్లు షియోమి చెబుతోంది. ఈ ఫోన్ లో Leica 75mm ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్, లైట్ ఫ్యూజన్ 900 ఇమేజ్ సెన్సార్ మరియు Leica 115 డిగ్రీ అల్ట్రా వైడ్ లెన్స్ జత కలిసిన ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా సెటప్ తో అద్భుతమైన ఫోటొలు మరియు వీడియో లను చిత్రీకరించ వచ్చని కూడా షోయోమి చెబుతోంది.

షియోమి 14 స్మార్ట్ ఫోన్ Dolby Vison మరియు Dolby Atmos సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ఎక్కువ కాలం మన్నిక కోసం IP68 వాటర్ & డస్ట్ ప్రూఫ్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo