Xiaomi 14 CIVI: అద్భుతమైన కెమెరా ఫీచర్లతో విడుదలయ్యింది.. ధర ఎంతంటే.!

Updated on 12-Jun-2024
HIGHLIGHTS

iaomi 14 CIVI స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను Leica కెమెరా సెటప్ మరియు అద్భుతమైన కెమెరా ఫీచర్ లతో విడుదల చేసింది

ఈ ఫోన్ Leica ప్రొఫెషనల్ కెమెరా సెటప్ తో వచ్చింది

Xiaomi 14 CIVI: గత నెల రోజులుగా షియోమీ టీజింగ్ చేస్తున్న Xiaomi 14 CIVI స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Leica కెమెరా సెటప్ మరియు అద్భుతమైన కెమెరా ఫీచర్ లతో అందినట్లు, లాంచ్ సమయంలో కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను డ్యూయల్ టోన్ కలర్ డిజైన్ లో మూడు కలర్ ఆప్షన్ లలో కూడా అందించింది. జెస్ట్ ఇప్పుడే మార్కెట్లో విడుదలైన ఈ షియోమీ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Xiaomi 14 CIVI: ధర

షియోమీ ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 42,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (12GB + 512GB) ను రూ. 47,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ జూన్ 20 వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈరోజు నుండే ఈ ఫోన్ Pre Orders ను షియోమీ ప్రారంభించింది.

ఆఫర్స్

ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ తో రూ. 3,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది. అలాగే, రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ వారికి లభిస్తుంది.

Xiaomi 14 CIVI: ఫీచర్స్

ఈ షియోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ AMOLED డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు HDR 10, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ తో ఉంటుంది మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను Hi-Res ఆడియో మరియు హై-రెస్ వైర్లెస్ తో పాటు Dolby Atmos సపోర్ట్ తో అందించింది.

Xiaomi 14 CIVI Features

ఈ షియోమీ కొత్త ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో వచ్చింది. ఈ వేగవంతమైన చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X RAM మరియు 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మంచి కనెక్టివిటీ మరియు ఇంటర్నెట్ కోసం ప్రత్యేకమైన T1 సిగ్నల్ ఎన్హెన్స్ మెంట్ చిప్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను 4700mAh బ్యాటరీ మరియు 67W టర్బో ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Also Read: HMD Feature Phones: రెండు కొత్త ఫీచర్ ఫోన్ లను లాంచ్ చేసిన నోకియా యాజమాన్య కంపెనీ.!

ఈ ఫోన్ లో ముందు ఆటో ఫోకస్ సపోర్ట్ కలిగిన 32MP + 32MP (అల్ట్రా వైడ్) సెల్ఫీ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలతో పాటు అల్ట్రా వైడ్ తో గ్రూప్ సెల్ఫీ లను కూడా క్లిక్ చేయవచ్చని షియోమీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక Leica ప్రొఫెషనల్ కెమెరా సెటప్ ను ను కలిగి వుంది. ఇందులో, 50MP మెయిన్ + 50MP టెలిఫోటో + 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉన్నాయి. ఈ ఫోన్ లో 4K మాస్టర్ సినిమా మోడ్ లో 10bit HLG వీడియో లను రికార్డ్ చేయవచ్చని తెలిపింది. అంతేకాదు. ఈ ఫోన్ లో టన్నుల కొద్దీ Leica కెమెరా ఫిల్టర్ లు మరియు ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :