Xiaomi 14 CIVI: ఇండియాలో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ వివరాలు వెల్లడించింది. అదే, షియోమీ 14 సివి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ఇండియాలో జూన్ 12వ తేదీ విడుదల చేయబోతున్నట్లు షియోమీ ప్రకటించింది. ఈ ఫోన్ ను సినిమాటిక్ కెమెరా మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. షియోమీ టీజర్ ద్వారా ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్లు మరియు స్పెక్స్ ను కూడా కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది.
షియోమీ 14 సివి స్మార్ట్ ఫోన్ ను గొప్ప కెమెరా సెటప్ తో అంధిస్తునట్లు చెబుతోంది. ఈ ఫోన్ లో అందించి కెమెరా సెటప్ వివరాలు ఈ ఫోన్ టీజర్ ద్వారా వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ లో 50MP సిమ్మి లక్స్ Leica కెమెరా, 50MP లైకా పోర్ట్రైట్ టెలీఫోటో కెమెరా మరియు 12MP లైకా అల్ట్రా వైడ్ లెన్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP + 32MP డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా తెలిపింది.
Also Read: సరికొత్త లెథర్ డిజైన్ తో వచ్చిన SAMSUNG Galaxy F55 5G ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
ఈ ఫోన్ కెమెరాతో సినిమా లాంటి ఫోటోలను వీడియోలను షూట్ చేయవచ్చని షియోమీ తెలిపింది. ఈ ఫోన్ లో అందించిన డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో సినిమాటిక్ సెల్ఫీ లను, 4K UHD వీడియో మరియు రియల్ టైం సబ్ టైటిల్స్ ను ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ఫస్ట్ ఫ్లోటింగ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే అవుతుంది మరియు ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో కూడా ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5 Vivid 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 ప్రోసెసర్ తో వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ షియోమీ హైపర్ OS పైన నడుస్తుంది.
ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ లో 67W టర్బో ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4700mAh బ్యాటరీ ఉన్నట్లు కూడా షియోమీ తెలిపింది.