ఇండియాలో షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 26న Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలుపడంతో పాటుగా టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కామింగ్ ఫోన్ కెమేరాలో ప్రముఖ కెమేరా సంస్థ Leica ను భాగస్వామ్యం చేసినట్లు షియోమి వెల్లడించింది. అంతేకాదు, mi.com నుండి ఇప్పటికే అందించిన టీజింగ్ వీడియో ద్వారా Leica కంపెనీతో షియోమి కి ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుకు చేసింది. ఈ షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లీకైన స్పెక్స్ వివరాలు ఏమిటో చూద్దామా.
Xiaomi 13 Pro ఇప్పటికే చైనా మరియు యూరప్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఆవే స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ షియోమీ ఇండియాలో విడుదల చేయవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, Xiaomi 13 Pro 6.7 ఇంచ్ LTPO కర్వ్డ్ డిస్ప్లేని 2K రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. షియోమి 13 ప్రో స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 పవర్డ్ స్మార్ట్‌ఫోన్. దీనికి జతగా, 12GB వరకు LPDDR5x RAM మరియు 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
Xiaomi 13 Pro వెనుక చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సిస్టం, డ్యూయల్-LED ఫ్లాష్ మరియు Leica బ్రాండింగ్ కలిగి ఉంటుంది. Xiaomi 13 ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4820mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.