షియోమి ఇండియాలో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం డేట్ ప్రకటించింది. అదే Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ప్రీమియం Leica కెమేరా ఫోన్ గా పిలవబడుతోంది. ఈ ఫోన్ ను ఫిబ్రవరి 26న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే అందించిన టీజింగ్ వీడియో లో Leica కంపెనీతో షియోమి కి ఉన్న అనుబంధాన్ని మరియు లైకా కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు వివరించింది. వాస్తవానికి, Xiaomi 13 సిరీస్ ఇప్పటికే చైనాలో అందుబాటులో వుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో విడుదలకు సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ ఫోన్ లీకైన మరియు అంచనా స్పెక్స్ ఏమిటో చూద్దాం.
Xiaomi 13 Pro ఇప్పటికే చైనా మరియు యూరప్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఆవే స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ షియోమీ ఇండియాలో విడుదల చేయవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, Xiaomi 13 Pro 6.7 ఇంచ్ LTPO కర్వ్డ్ డిస్ప్లేని 2K రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. షియోమి 13 ప్రో స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 పవర్డ్ స్మార్ట్‌ఫోన్. దీనికి జతగా, 12GB వరకు LPDDR5x RAM మరియు 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
Xiaomi 13 Pro వెనుక చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సిస్టం, డ్యూయల్-LED ఫ్లాష్ మరియు Leica బ్రాండింగ్ కలిగి ఉంటుంది. Xiaomi 13 ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ + 12-మెగాపిక్సెల్ + 10-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4820mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.