Xiaomi 13 Pro 5G: భారీ ఫీచర్లతో వచ్చిన ఈ షియోమి ఫోన్ ధర ఎంతంటే.!

Xiaomi 13 Pro 5G: భారీ ఫీచర్లతో వచ్చిన ఈ షియోమి ఫోన్ ధర ఎంతంటే.!
HIGHLIGHTS

Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలయ్యింది

ఈ షియోమి ఫోన్ భారీ Leica కెమేరా సెట్టింగ్ తో ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది

ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ వున్నాయి

Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదలయ్యింది. ఈ షియోమి ఫోన్ భారీ Leica కెమేరా సెట్టింగ్ తో ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్, బ్లేజింగ్ స్పీడ్ ఛార్జింగ్ టెక్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను షియోమి ఇండియాలో ప్రవేశపెట్టింది. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను వెల్లడించిన కంపెనీ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ ధర ను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ వున్నాయి.    
Xiaomi 13 Pro 5G: ధర   

షియోమి 13 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ సింగల్ వేరియంట్ తో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.79,999 రూపాయల ధరతో షియోమి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్లను కూడా కంపెనీ జతచేసింది. 

Xiaomi 13 Pro 5G:ఆఫర్లు

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI తో ఈ ఫోన్ కొనేవారికి 10,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI తో ఈ ఫోన్ కొనేవారికి 8,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. షియోమి/రెడ్ మి ఫోన్ తో ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 12,000 ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. అంతేకాదు, No Cost EMI                

Xiaomi 13 Pro 5G: స్పెక్స్  

Xiaomi 13 Pro 5G ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా షియోమి ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ E6 AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణని ఈ ఫోన్ లో జతచేసింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen2 SoC తో పనిచేస్తుంది. అంతేకాదు, ఇది LPDDR5X 12GB RAM మరియు UFS 4.0 256GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ షియోమి ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX989) కెమెరాకి జతగా 3.2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమేరా సిస్టం Leica కెమేరా పనితనం తో నిర్మించబడింది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు 

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 4,820mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ మరియు 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ లను Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా కలిగి ఉంది. 

Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను ముందుగా అందించిన కంపెనీ, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ యొక్క ధర వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. అంటే, ఈ ఫోన్ ధర వివరాలు రేపు తెలియ చేయబడతాయి.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo