షియోమి ఈరోజు తన Xiaomi 13 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ కెమేరా తయారీ కంపెనీ Leica యొక్క భాగస్వామ్యంతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వెనుక Leica బ్రాండింగ్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేవలం కెమేరా మాత్రమే కాదు, స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ఫాస్ట్ షిప్ సెట్, ఫాస్ట్ ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ఈ షియోమి ప్రమియం Leica కెమేరా ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.
Xiaomi 13 Pro 5G ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క ఫీచర్లను కూడా షియోమి ప్రీమియం గానే అందించింది. ఈ ఫోన్ 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ E6 AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణని ఈ ఫోన్ లో జతచేసింది.
ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen2 SoC తో పనిచేస్తుంది. అంతేకాదు, ఇది LPDDR5X 12GB RAM మరియు UFS 4.0 256GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ షియోమి ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX989) కెమెరాకి జతగా 3.2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమేరా సిస్టం Leica కెమేరా పనితనం తో నిర్మించబడింది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు
Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 4,820mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా కలిగి ఉంది.
Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను ముందుగా అందించిన కంపెనీ, ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ యొక్క ధర వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. అంటే, ఈ ఫోన్ ధర వివరాలు రేపు తెలియ చేయబడతాయి.