వాటర్ రేసిస్టంట్ , డస్ట్ రేసిస్టంట్, unbreakable అంటూ కొన్ని ఫోనులు ప్రస్తుత మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటర్ రేసిస్టంట్ అనేది కేవలం లిమిటెడ్ గానే పనిచేస్తుంది.
ఇప్పుడు జపాన్ లో కొత్తగా సబ్బుతో కడిగినా ఏమీ కాని ఫోన్ ఒకటి లాంచ్ అయ్యింది. మీ ఫోన్ మీద ఉండే dirt అండ్ ఫింగర్ ప్రింట్స్ ను కడిగి మరీ వాడుకోవచ్చు.
లిటరల్ గా వాషింగ్ చేసుకునే సౌలభ్యం ఉంది దీనిలో. ప్రసుతం మనం ఎక్కడికి వెళ్ళిన చేతిలో స్మార్ట్ ఫోన్ కంపల్సరీ. సో 4gb ర్యామ్ లు 4k డిస్ప్లే ల కన్నా ఇలాంటివి కచ్చితంగా అవసరమే.
హోటల్స్ లో పనిచేసే వారికీ, ఇంట్లో mothers కు పర్ఫెక్ట్ ఫోన్. ఎందుకంటే దీనిలో డిస్ప్లే ఫోన్ కంప్లీట్ గా wet గా ఉన్నా ఆపరేట్ చేయగలం. అంతే కాదు స్క్రాచ్ healing ఫినిషింగ్(LG G flex లో ఉంది ఇది) కూడా ఉంది.
స్పెక్స్ – 5in 720P డిస్ప్లే, 10.1mm స్లిమ్ బాడీ, 13MP రేర్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1, స్మార్ట్ సోనిక్ రిసీవర్(external స్పీకర్స్ ఏమీ లేకుండా సౌండ్ ప్రడ్యూస్ చేస్తుంది.)
డిసెంబర్ 11 న జపాన్ లో లాంచ్ అవుతుంది. దీని పేరు Kyocera Digno "Rafre", ధర 31,083 రూ.
ఇది ముఖ్యంగా ఎవ్వరికీ కనిపించని బాక్టీరియా నుండి బయట పడేందుకు బాగా useful అవుతుంది వాషింగ్ వలన. క్రింద వీడియో యాడ్ చూడండి.