OnePlus 6T స్మార్ట్ ఫోన్ 2,98,011 – AnTuTu స్కోరుతో మూడవ వేగవంతమైన ఫోనుగా అవతరించింది

Updated on 31-Oct-2018
HIGHLIGHTS

OnePlus 6T స్మార్ట్ ఫోన్, Huawei Mate 20 - 357,000 మరియు ASUS ROG - 304,000 తారువాత AnTuTu బెంచ్మార్క్ లో మూడవ స్థానాన్నిసాధించింది.

ఎట్టకేలకు, OnePlus సంస్థ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్తో OnePlus 6T ను విడుదల చేసింది, దీని గడియార వేగం 2.8GHz వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు రకాలైన, 6GB RAM  మరియు 8GB RAM తో వస్తుంది. ఇది OnePlus 6 నుండి ఒక స్పెషల్ బంప్ కానప్పటికీ, AnTuTu లో OnePlus 6T – 298,011 స్కోర్ చేసింది, ఇది ఇంతకు మునుపు సాధించిన 277,000  నుండి ఒక జంప్.  అంటే దీనర్థం, సంస్థ నుండి వచ్చిన ఈ తాజా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో మూడవ వేగవంతమైన Android ఫోన్ అవుతుంది. ఈ OnePlus 6T యొక్క స్కోర్లు న్యూయార్క్లో ప్రారంభోత్సవం సందర్భంగా వెయిబోలో విడుదల చేయబడ్డాయి.

OnePlus 6T ఇటీవల ప్రారంభించిన హువాయ్ మేట్ 20 ను అనుసరిస్తుంది, ఇది 357,000 మరియు ASUS ROG ఫోన్లను 304,000 లకు చేరుకుంది, వీటిని AnTuTu బెంచ్ మార్కులపై పెట్టింది. హువాయ్ మేట్ 20 కిరిన్ 980 SoC శక్తినిచ్చింది, ఇది 7nm నిర్మాణంపై ఆధారపడింది. కార్టెక్స్-ఎ 76 ఆధారిత CPU కలిగి డయల్- NPU మాలి- G76 GPU తో మరియు 2133MHz వద్ద క్లాక్ చేయబడిన LPDDR4X మెమొరీకు మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే ASUS ROG ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ను 4x 2.96 GHz క్రియో 385 మరియు 4x 1.8 GHz క్రియో 385 తో 64 బిట్స్ నిర్మాణం మరియు గ్రాఫిక్ ప్రాసెసర్ Qualcomm Adreno 630 ను ఉపయోగిస్తుంది.

 వన్ ప్లస్ 6T  2.8Ghz క్లాక్ వేగంగల క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 SoC తో శక్తిని పొందింది మరియు 6GB ర్యామ్ జతగా 128GB అంతర్గత స్టోరేజి మరియు 8GB ర్యామ్ జతగా 256GB అంతర్గత స్టోరేజి వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది LPDDR4X ర్యామ్ మరియు UFS 2.12-Lane  స్టోరేజిని కలిగి ఉంటుంది.  ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత తాజా ఆక్సిజన్ OS తో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త OS, అప్డేటింగ్ గేమ్ మోడ్ మరియు స్మార్ట్ బూస్ట్ వంటి చాల మెరుగుదలలను తీసుకొచ్చింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :