విండోస్ 10 లేటెస్ట్ అప్ డేట్: ఇక మొబైల్స్ లో డబుల్ మల్టీ టాస్కింగ్ పవర్

Updated on 25-Feb-2016

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మొబైల్ కు Insider Preview బిల్డ్ 14267 ను రిలీజ్ చేసింది. దీనిలో కన్సుమర్ visible ఫీచర్స్ బాగా ఉన్నాయి. అప్ డేట్ కేవలం ఫాస్ట్ రింగ్ లో ఉన్న వారికే రిలీజ్ అయ్యింది.

వాటిలో ప్రధానమైనది మల్టీ టాస్కింగ్ extension. అంటే ఇప్పటివరకు విండోస్ బ్యాక్ గ్రౌండ్ లో 8 యాప్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు 16 యాప్స్ వరకూ ఒకే సారి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతాయి.

విండోస్ మామూలుగా ఆండ్రాయిడ్ కన్నా ఫాస్ట్ గా ఉంటుంది అనుకునే వారికి ఇది నచ్చే విషయం. దీనితో పాటు cortana మ్యూజిక్ సర్చ్ కూడా కొత్త అప్ డేట్ లో ఉంది. 

మైక్రోసాఫ్ట్ edge బ్రౌజర్ లో InPrivate టాబ్స్ సపోర్ట్, డౌన్లోడ్స్ cancellation, బ్రౌజర్ url అడ్డ్రెస్ బార్ లో కీ ప్యాడ్ స్వైపింగ్ సపోర్ట్ వంటివి యాడ్ అయ్యాయి. వెంటనే అప్ డేట్ చెక్ చేయండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :