xiaomi మోస్ట్ waited రెడ్మి నోట్ 2 ను లాంచ్ చేసింది ఈ రోజు చైనా లో. MIUI కొత్త వెర్షన్ 7 కూడా రిలీజ్ అయ్యింది ఈ ఈవెంట్ లో. లుక్స్ పరంగా mi 4i లా ఉన్న రెడ్మి నోట్ 2 తో పాటు నోట్ prime కూడా లాంచ్ అయ్యింది.
రెడ్మి నోట్ 2 స్పెసిఫికేషన్స్ – 5.5 in FHD 1080P డిస్ప్లే, హై లైట్ విషయం ఏంటంటే మీడియా టెక్ Helio X10 ఆక్టో కోర్ 2.0GHz హై ఎండ్ లేటెస్ట్ ప్రొసెసర్ ఉంది దీనిలో.ఇదే SoC htc one m9 ప్లస్(35,000 రూ) లో ఉంది. 2gb ర్యామ్, 13MP రేర్ omni విజన్ సెన్సార్ కెమేరా. 5MP ఫ్రంట్ కెమేరా, 3060 mah రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ బేస్డ్ MIUI 7 os, 160 గ్రా బరువు, 4G, డ్యూయల్ సిమ్.
రెడ్మి నోట్ 2 prime(TDD-LTE + FDD-LTE) లో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాని డ్యూయల్ సిమ్ బాండ్స్ లో మార్పులు ఉన్నాయి. అలాగే ఇది 32gb స్టోరేజ్ తో వస్తుంది అండ్ దీనిలో 2.2 GHz క్లాక్ స్పీడ్ సేమ్ ప్రొసెసర్ ఉంది. రెడ్మి నోట్ 2 prime ధర 10,000 రూ.(సుమారు)
రెడ్మి నోట్ 2 రెండు వేరియంట్స్ లో వస్తుంది. రెండు వేరియంట్స్ కు కేవలం నెట్వర్క్ బాండ్స్ లోనే మార్పు ఉంది. మిగిలినవి అన్నీ సేమ్. ఇవి 16GB స్టోరేజ్ ఆప్షన్స్ లోనే వస్తున్నాయి. మొదటి వేరియంట్ TDD-LTE + TDD-SCDMA ధర 8,000 రూ, రెండవది TDD-LTE + FDD-LTE 9,000 రూ.
xiaomi ఇండియన్ మార్కెట్ లో ఎప్పుడు వస్తున్నయని కంపెని ఇంకా వెల్లడించలేదు కాని xiaomi ఇండియాలో ఆగస్ట్ 19 న ఈవెంట్ ఉంది. బహుశా ఈ మోడల్స్ అప్పుడు లాంచ్ అవచ్చు ఇండియాలో.