2028 లో iPhone: ఫ్యూచర్ ఐఫోన్స్ ను మేము AI తో ప్రెడిక్ట్ చేశాం.!

2028 లో iPhone: ఫ్యూచర్ ఐఫోన్స్ ను మేము AI తో ప్రెడిక్ట్ చేశాం.!
HIGHLIGHTS

నోయిడా, ఇండియా – [ఏప్రిల్12,2023]: డిజిట్ ఎడిటోరియల్ టీమ్, జెనరేటివ్ AI టూల్స్ ఉపయోగించి ఫోల్డబుల్ స్క్రీన్ కలిగిన ఆపిల్  మొదటి iPhone ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఫిక్షనల్ కాన్సెప్ట్ ను ఊహించాము. ఇది iPhone Fold Max పిలబడవచ్చని మరియు ఇది కొత్త ఇన్నోవేటివ్ ఫీచర్స్ తో ఫోల్డబుల్ ఫోన్ మార్గంలో కొత్త ఒరవవుడిని సృష్టించ వచ్చని కూడా ఊహిస్తున్నాము. డిజిట్ ఎడిటోరియల్ టీమ్ ప్రకారం, ఈ iPhone Fold Max సరికొత్త టెక్నలాజీని, అద్భుతమైన కొత్త ఫీచర్లను ఆపిల్ సిగ్నేచర్ డిజైన్ తో పోర్ట్-లెస్ డిజైన్, హోలోగ్రాఫిక్ వీడియో సామర్ధ్యంతో పాటుగా హ్యప్టిక్ బటన్స్ మరియు ఫోల్డబుల్ డిస్ప్లే లను మిళితం చేస్తుంది.

డిజిట్ ఎడిటోరియల్ టీమ్ ఈ భవిష్య మరియు ఫిక్షనల్ ఐఫోన్ కాన్సెప్ట్ డివైజ్ కోసం క్రియేటివ్ AI ప్రాంప్ట్స్ తో కూడిన ChatGPT మరియు Midjourney లను ఉపయోగించింది. అనూహ్యంగా ఈ ప్రాంప్ట్స్ సింపుల్ “ఫోల్డబుల్ ఐఫోన్” నుండి చాలా వివరాత్మకంగా " ఒక చెక్క బల్ల పైన పరిచిన ఒక సైన్స్ -ఫిక్షన్ ఇన్స్పైర్డ్ ఫోన్, దాని స్క్రీన్ నుండి పైకి లేచినట్లు కనిపించే దక్షిణ ఆసియా యువకుడి 3D హైపర్ రియలిస్టిక్ హోలోగ్రామ్ ఫేస్, ఆక్టేన్ రెండర్, హైపర్ రియలిస్టిక్ వెలుగుతో " ఊహాజనిత డివైజ్ ఆర్ట్ ను చూపించింది. ఈ కాన్సెప్ట్ డివైజ్ iPhone Fold Max, ఫ్యూచర్ ఐఫోన్ లు రెట్టించిన అధునాతన ఫీచర్లను మరియు మెరుగైన యూజర్ అనుభవాన్ని అందించడానికి ఎలా అభివృద్ధి చేయబడతాయో అని చూపిస్తుంది మరియు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కొత్త ప్రమాణాలను ఉహించేలా చేస్తుంది.

దీని గురించి డిజిట్ యొక్క ఎడిటర్ ఇన్ చీఫ్ సోహమ్ రణింగా మాట్లాడుతూ " ఇది కార్యరూపం దాల్చినట్లయితే, ఈ ఊహాజనిత iPhone Fold Max ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన ఘనతను వివరిస్తుంది, డిజైన్ మరియు టెక్నాలజీలో ఆపిల్ యొక్క నైవుణ్యాన్ని సంపూర్ణంగా మిళితం చేస్తుంది". అని తెలిపారు. 

"ఇది యూజర్లు కమ్యూనికేట్ చేసే విధానాన్ని మార్చడమే కాకుండా, టోటల్ ఇండస్ట్రీకే కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసే డివైజ్ కూడా అవుతుంది", అని డిజిట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జయేష్ షిండే, జతచేశారు. 

దీని ఫోల్డబుల్ డిస్ప్లేతో, ఈ ఊహాజనిత iPhone Fold Max మనం ఇంతకు ముందెన్నడూ చూడని వెర్సిటాలిటీ మరియు పోర్టబిలిటీ స్థాయిని అందిస్తుంది, "దీని ఫోల్డబుల్ డిస్ప్లేతో, మనం ఇంతకు ముందెన్నడూ చూడని వెర్సిటాలిటీ మరియు పోర్టబిలిటీ స్థాయిని ఈ ఊహాజనిత iPhone Fold Max అందిస్తుంది, తద్వారా వినియోగదారులు మల్టీ టాస్కింగ్ మరియు మరింత లీనమయ్యే కంటెంట్ అనుభవానికి దారితీస్తుంది", డిజిట్ మేనేజింగ్ ఎడిటర్ మిథున్ మోహన్‌ దాస్ నొక్కి చెప్పారు. 

డిజిట్ యొక్క స్మార్ట్ ఫోన్ రివ్యూవర్ ధ్రితీ దత్తా, ఎవరైతే ఈ iPhone Fold Max మైన్ ఫీచర్స్ ను ఊహించడంలో చేరోరు ఆమె "హోలోగ్రాఫిక్ ఫేస్-ఐడి మరియు ఫేస్‌ టైమ్ ఫీచర్స్ నిజమైన గేమ్-ఛేంజర్స్ గా ఉంటాయి, ఎందుకంటే ఇది యూజర్లను ముందెన్నడూ చూడని విధంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ఇంటాక్ట్ చేయడానికి వీలుకల్పిస్తుంది. 2028 లో కూడా, ఊహాజనిత iPhone Fold Max స్మార్ట్‌ ఫోన్‌ లో సాధించగలిగే వాటి ఎల్లలను చేరిపిస్తుందనడంలో సందేహం లేదు. ఇది గ్రహించినట్లయితే, వాటి ఐకానిక్ డిజైన్ మరియు యూజర్  ఎక్స్ పీరియన్స్ కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతికతను అందించడానికి Apple యొక్క తిరుగులేని నిబద్ధతకు ఇది మరొక నిదర్శనం అవుతుంది.

ఊహాజనిత iPhone Fold Max కీ ఫీచర్స్ లో ఇవి ఉండవచ్చు

Foldable iPhone display

Foldable Display: ఈ iPhone Fold Max ఒక ఫోల్డబుల్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేని LTPO2 టెక్నాలజీతో కలిగివుంది, ఇది అతుకులేని మరియు లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది. మడిచినప్పుడు 6.8 ఇంచ్ ఫ్రెంట్ స్క్రీన్ మరియు తెరిచినప్పుడు 7.8 ఇంచ్ డిస్ప్లేతో మల్టీ టాస్కింగ్ మరియు కంటెంట్ వినియోగాన్ని అందించే ఒక అనుకూలమైన డివైజ్ ను యూజర్లు ఆస్వాదించవచ్చు. 

Haptic Buttons: సాధారణ మెకానికల్ బటన్స్ స్థానంలో టచ్-సెన్సిటివ్ తో రీప్లేస్ చెయ్యడం ద్వారా, iPhone Fold Max మరింత క్రమబద్ధీకరించబడిన మరియు ఫ్యూచర్ డిజైన్ ను అందిస్తుంది. హాప్టిక్ ఫీడ్ బ్యాక్ టెక్నాలజీ స్పర్శానుభూతిని అందిస్తుంది, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ను మరింతగా పెంచడం ద్వారా గొప్ప మన్నికను అందిస్తుంది. 

Foldable iPhone cameras

Portless Design: వైర్ లెస్ టెక్నాలజీని తనలో ఇముడ్చుకుంటు, ఈ iPhone Fold Max భౌతిక పోర్ట్స్ అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది. MagSafe ఛార్జింగ్ మరియు వైర్ లెస్ డేటా ట్రాన్స్ఫర్ సహాయ సామర్ధ్యాలు ఒక సన్నని మరియు సుందరమైన డిజైన్ ను దీనికి ఆపాదిస్తాయి, అదే సమయంలో వైర్ లెస్ ఛార్జింగ్ ను అక్కున చేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ను మరింతగా మెరుగుపరుస్తుంది. 

Foldable iPhone design

Halographic Face-ID and Face Time: ఈ iPhone Fold Max: హోలో గ్రాఫిక్ Face-ID మరియు ఫేస్ టైమ్ ఫీచర్లను పరిచయం చేస్తుంది,   అంటే హోలో గ్రాఫిక్ టెక్నాలజీని ఈ iPhone Fold Max తెరపైకి తీసుకువస్తుంది. ఈ ఆవిస్కరణలు మరింత లీనమయ్యే మరియు ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అనుభవాలను ఎనేబుల్ చేయడమేకాకుండా ఫిషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ యొక్క సెక్యూరిటీ మరియు ఖచ్చితత్వాన్ని పెంచుతాయి. 

Foldable iPhone Holographic

పైన తెలిపిన సంచలనాత్మక ఫీచర్లతో పాటుగా ఈ ఊహాజనిత iPhone Fold Max దాదాపుగా అడ్వాన్స్డ్ A21 బయోనిక్ చిప్ తో అందించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, డిజిట్ ఎడిటోరియల్ టీమ్ ఊహించింది, ఇది లైటెనింగ్- ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ లను అందిస్తుంది. ఈ డివైజ్ ఆకర్షణీయమైన కెమేరా సిస్టమ్ మరియు దాని సామర్ధ్యాల గురించి గొప్పగా చేబుతోంది,
ఇది ఎటువంటి పరిస్థితులలో అయినా అద్భుతమైన స్టిల్ మరియు వీడియో గ్రఫీని నిర్ధారిస్తుంది. 

About Digit

గత 22 సంవత్సరాలుగా, టెక్నాలజీ గురించి మీరు కోరుకునే లేదా తెలుసుకోవలసిన ప్రతి విషయంలోనూ మీకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా ఉండాలనే మా లక్ష్యంలో మేము నిశ్చయంగా ఉన్నాము. భారతదేశం మరియు ప్రపంచంలోని మిలియన్ల మంది సందర్శకులకు Digit.in మొత్తం 8 భాషలలో (ఇంగ్లీష్ + 7 మాతృభాషలో) సేవలందిస్తోంది, భారతదేశంలోని టాప్ 3 ఆన్‌ లైన్ టెక్ డెస్టినేషన్స్ లో (Comscore ర్యాంకింగ్స్ ప్రకారం) డిజిట్ ఒకటి. ఏది కొనాలి మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందడం గురించి మీకు ఇన్ఫర్మేషన్, ఒపీనియన్ మరియు సలహాలను అందించడం ద్వారా డిజిట్ మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అనే దాని పైన మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. నిరంతరం పెరుగుతున్న మా కమ్యూనిటీతో, డిజిట్ అనేది డిజిట్‌లో అంతర్భాగమైన సభ్యులు మరియు అనుచరులందరి కలయిక. డిజిట్ అనేది బ్రాండ్ కాదు, ఇది టెక్నాలజీ పట్ల మీ అభిరుచిని వ్యక్తీకరించే కమ్యూనిటీ.                                                                        

  Digit's Gaming brand – SKOAR!, డిజిట్ SKOAR వంటి దాని డిజిటల్ మరియు ఆన్-గ్రౌండ్ ప్రాపర్టీల ద్వారా గేమర్లతో కనెక్ట్ అవుతుంది! స్కోర్ కాలేజ్ గేమింగ్ క్లబ్ (SCGC). భారతదేశంలో కాలేజీ-స్థాయి గేమింగ్ ఎకో సిస్టమ్ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి కేంద్రీకరించిన SCGC భారతదేశంలోని డజన్ల కొద్దీ కాలేజీలలో గేమింగ్ క్లబ్స్/e-స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లను స్థాపించడానికి మరియు విద్యార్థుల పోటీ గేమింగ్ లీగ్‌ లకు మద్దతునిచ్చేందుకు భారతదేశంలోని కాలేజీలను భాగస్వామ్యం చేయడం ద్వారా గేమర్‌ లతో నిమగ్నమై ఉంది.

Press Contact:

ధ్రితీ దత్తా: dhriti.datta@digit.in (+91.22.67899666)

Disclaimers:

ఈ ప్రెస్ రిలీజ్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది మరియు Apple Inc తో  అనుబంధించబడలేదు, ఆమోదించబడలేదు లేదా స్పాన్సర్ చేయబడలేదు. ఈ iPhone Fold Max అనేది Digit యొక్క ఎడిటోరియల్ టీమ్ ద్వారా ఊహించబడిన ఒక ఊహాత్మక భావన డివైజ్ మరియు ఇది Apple Inc. ద్వారా వచ్చిన అధికారిక ప్రోడక్ట్ లేదా ప్రకటన మాత్రం కాదు. ఏదైనా ఇమేజ్‌ మరియు స్పెసిఫికేషన్‌ లతో సహా పూర్తి కంటెంట్ ఊహాజనితమైనది మరియు కేవలం విద్యావంతుల అంచనాల ఆధారంగా ఉంటుంది మరియు Apple Inc నుండి ఏదైనా భవిష్యత్ ప్రోడక్ట్ యొక్క వాస్తవ ఫీచర్స్ లేదా స్పెసిఫికేషన్‌ లను ప్రతిబింబించకపోవచ్చు.

ఈ Press Release లో పేర్కొన్న అన్ని ట్రేడ్‌ మార్క్‌లు, లోగోలు, ప్రోడక్ట్ పేర్లు మరియు కాపీరైట్స్ వాటి సంబంధిత యజమానుల ఆస్తి. Apple, iPhone మరియు ఏదైనా ఇతర Apple ఉత్పత్తి లేదా సర్వీస్ పేర్లు Apple Inc యొక్క నమోదిత ట్రేడ్‌మార్క్‌లు. ఈ ప్రెస్ రిలీజ్  లో Apple యొక్క ట్రేడ్‌మార్క్‌లు మరియు మేధో సంపత్తిని ఉపయోగించడం సచిత్ర ప్రయోజనాల కోసం మాత్రమే మరియు Apple Inc ద్వారా ఎటువంటి అనుబంధం, ఆమోదం లేదా స్పాన్సర్‌ షిప్‌ ను సూచించదు. డిజిట్ Apple Inc. యొక్క మేధో సంపత్తి హక్కులను గుర్తిస్తుంది మరియు గౌరవిస్తుంది మరియు ఈ పత్రికా ప్రకటనను రూపొందించడంలో ఆ హక్కులను ఉల్లంఘించే ఉద్దేశం లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo