డ్యూయల్ డిస్ప్లే లతో డ్యూయల్ పవర్ కలిగిన Vota సూపర్ ఫోన్ వస్తుంది

Updated on 01-Apr-2016

ఫ్రాన్స్ based స్టార్ట్ అప్ కంపెని  రెండు స్మార్ట్ ఫోన్లు కు ఉండే పవర్ ను ఒకే దానిలో ఉండేలా కొత్త కాన్సెప్ట్ ను డెవలప్ చేస్తుంది అని exclusive ఇన్సైడ్ టాక్స్.

కంపెని పేరు vota. ఆల్రెడీ ఒక టీసర్ కూడా పోస్ట్ అయ్యింది. ఇది ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెడుతుంది అని కంపెని చెబుతుంది.

Vota డ్యూయల్ సూపర్ ఫోన్ లో రెండు 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్లు ఉండనున్నాయని అని రిపోర్ట్స్. రెండు వైపులా రెండు 5.5 in అమోలేడ్ డిస్ప్లేలు,

రెండు ప్రోసేసర్లకు రెండు 8GB ర్యామ్స్ – అంటే 16GB ర్యామ్ టోటల్ గా,  రెండు 21MP కెమెరా సేన్సార్స్, వీటి అన్నిటికీ మించి ఫోనులో Graphene based బ్యాటరీ ఉంటుంది.

అంటే బ్యాటరీ అల్ట్రా thin అండ్ ఫ్లెక్సిబుల్. రెండు వైపులా ఉండే రెండు స్క్రీన్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఇది అంతా వినటానికి నమ్మశక్యంగా లేదు కాని Vota ఇది నిజమే అని చెబుతుంది.

అందుకు ఫోన్ తో తీసిన కొన్ని శాంపిల్ ఫోటో గ్రాఫ్స్ కూడా పంపింది. మరిన్ని డిటేల్స్ ను కోరగా కంపెని ఈ రోజు లోపల సూపర్ ఫోన్ పై మరిన్ని డిటేల్స్ ఇవనున్నాము అని బదులు ఇచ్చింది. సో దీనిపై మరింత అప్ డేట్స్ కొరకు stay tuned!

 

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :