vivo Y200e 5G: ఇండియాలో వివో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో వై200e 5జి పేరుతో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 20 వేల రూపాయల ఉప బడ్జెట్ లో టాప్ క్లాస్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది. 20 వేల రూపాయల్ ధరలో భారత మార్కెట్ లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ కాంపీటీషన్ ను తట్టుకునేలా ఈ ఫోన్ ను వివో లాంఛ్ చేసింది. ఈ వివో వై200e 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు Top-5 ఫీచర్లు తెలుసుకోండి.
వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 6GB మరియు 8GB రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 6GB+128GB వేరియంట్ ను రూ. 19,999 ధరతో మరియు 8GB+128GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Prebook ఆర్డర్స్ ఈ రోజు వివో నుండే మొదలుపెట్టింది. ఈ ఫోన్ ను vivo.com మరియు Flipkart నుండి ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు.
వివో వై200e స్మార్ట్ ఫోన్ లో In-display ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది.
ఈ వివో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 ప్రోసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ Funtouch OS 14 సాఫ్ట్ వేర్ పైన లేటెస్ట్ Android OS తో పని చేస్తుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ బడ్జెట్ 4nm ప్రోసెసర్ మరియు ఈ బడ్జెట్ కేటగిరిలో ఫాస్ట్ గా ఉంటుంది.
వివో వై200e స్మార్ట్ ఫోన్ 6 GB మరియు 8 GB RAM ఆప్షన్ లతో వస్తుంది. అయితే, ఈ రెండు ర్యామ్ ఆప్షన్ లలో కూడా 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కామన్ గా ఉంటుంది.అయితే, ఈ ఫోన్ లో Extended RAM 3.0 సపోర్ట్ అందించడం ద్వారా ఈ ఫోన్ ర్యామ్ ను 6GB/8GB వరకూ పెంచుకునే వేలు అందించింది.
Also Read: Xiaomi 14: కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో లాంఛ్ అవుతోంది.!
ఈ వివో ఫోన్ లో వెనుక 50 MP + 2 MP + Flicker Sensor కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ మెయిన్ కెమేరాతో స్టన్నింగ్ ఫోటోలను షట్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
వివో వై200e ఫోన్ లో 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఎక్కువకాలం పని చేసేలా చేసే 5000 mAh బిగ్ బైటరి కూడా వుంది.