vivo Y200e 5G: ఇండియాలో విడుదలైన వివో కొత్త 5జి ఫోన్ Top-5 ఫీచర్లు తెలుసుకోండి.!

vivo Y200e 5G: ఇండియాలో విడుదలైన వివో కొత్త 5జి ఫోన్ Top-5 ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఇండియాలో వివో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

20 వేల ఉప బడ్జెట్ లో టాప్ క్లాస్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది

వివో వై200e 5జి స్మార్ట్ ఫోన్ Top-5 ఫీచర్లు తెలుసుకోండి

vivo Y200e 5G: ఇండియాలో వివో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో వై200e 5జి పేరుతో తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 20 వేల రూపాయల ఉప బడ్జెట్ లో టాప్ క్లాస్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చింది. 20 వేల రూపాయల్ ధరలో భారత మార్కెట్ లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ కాంపీటీషన్ ను తట్టుకునేలా ఈ ఫోన్ ను వివో లాంఛ్ చేసింది. ఈ వివో వై200e 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు Top-5 ఫీచర్లు తెలుసుకోండి.

vivo Y200e 5G Price

వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 6GB మరియు 8GB రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 6GB+128GB వేరియంట్ ను రూ. 19,999 ధరతో మరియు 8GB+128GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Prebook ఆర్డర్స్ ఈ రోజు వివో నుండే మొదలుపెట్టింది. ఈ ఫోన్ ను vivo.com మరియు Flipkart నుండి ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు.

వివో వై200e 5G టాప్ -5 ఫీచర్స్

Display

వివో వై200e స్మార్ట్ ఫోన్ లో In-display ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది.

Processor

ఈ వివో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 ప్రోసెసర్ తో వచ్చింది. ఈ ఫోన్ Funtouch OS 14 సాఫ్ట్ వేర్ పైన లేటెస్ట్ Android OS తో పని చేస్తుంది. ఇది క్వాల్కామ్ లేటెస్ట్ బడ్జెట్ 4nm ప్రోసెసర్ మరియు ఈ బడ్జెట్ కేటగిరిలో ఫాస్ట్ గా ఉంటుంది.

RAM & Storage

వివో వై200e స్మార్ట్ ఫోన్ 6 GB మరియు 8 GB RAM ఆప్షన్ లతో వస్తుంది. అయితే, ఈ రెండు ర్యామ్ ఆప్షన్ లలో కూడా 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కామన్ గా ఉంటుంది.అయితే, ఈ ఫోన్ లో Extended RAM 3.0 సపోర్ట్ అందించడం ద్వారా ఈ ఫోన్ ర్యామ్ ను 6GB/8GB వరకూ పెంచుకునే వేలు అందించింది.

Also Read: Xiaomi 14: కొత్త జెనరేషన్ Leica ఆప్టికల్ లెన్స్ తో లాంఛ్ అవుతోంది.!

Camera

ఈ వివో ఫోన్ లో వెనుక 50 MP + 2 MP + Flicker Sensor కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ మెయిన్ కెమేరాతో స్టన్నింగ్ ఫోటోలను షట్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.

Charge & Battery

వివో వై200e ఫోన్ లో 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఎక్కువకాలం పని చేసేలా చేసే 5000 mAh బిగ్ బైటరి కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo