Vivo Xplay6 స్మార్ట్ ఫోన్ , 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్

Vivo Xplay6 స్మార్ట్ ఫోన్ , 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో  లాంచ్
HIGHLIGHTS

Vivo Xplay6 64GB వేరియంట్ ధర 3998 Yuan ( సుమారు Rs. 37,544)

Vivo Xplay6  స్మార్ట్  ఫోన్  128GB  వేరియంట్  ని గత  ఏడాది   నవంబర్  చైనా  లో  4498 yuan ( సుమారు  Rs 44,449)  ధరకు లాంచ్ చేశారు. ఇప్పుడు కంపెనీ 64GB  ఇంటర్నల్ స్టోరేజ్  గల వేరియంట్ ని చైనా లో  లాంచ్ చేసింది. Vivo Xplay6 64GB  వేరియంట్ ధర  3998 Yuan ( సుమారు  Rs. 37,544) ఇది  రోజ్  గోల్డ్ కలర్స్ లో అవైలబుల్  గా వుంది.   ప్రస్తుతం కంపెనీ మెట్ బ్లాక్  వేరియంట్  ని ప్రవేశపెట్టింది.  అది కూడా  128GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.Vivo Xplay6 64GB  లో ఇమ్మిడివున్న  ఫీచర్స్ పై  కనుక  ఓ  కన్నేస్తే  5.46- ఇంచెస్  క్వాడ్  HD  సూపర్  AMOLED డ్యూయల్ curved ఎడ్జ్ డిస్ప్లే ఇవ్వబడింది.  ఈ డిస్ప్లే  యొక్క రెసొల్యూషన్  2560×1440  పిక్సల్స్.ఇది క్వాడ్ కోర్  స్నాప్డ్రాగన్  820 64- బిట్ ప్రోసెసర్  మరియు అడ్రినో  530 GPU  కలిగి వుంది .  దీనిలో 6GB   RAM మరియు  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది . ఫింగర్  ప్రింట్  సెన్సార్  తో ఫుల్ మెటల్ బాడీ కలిగి వుంది. Vivo Xplay6 64GB  లో డ్యూయల్  కెమెరా  సెటప్  కలదు ,  ఒక కెమెరా 12  ఎంపీ రేర్  కెమెరా డ్యూయల్ టోన్  LED ఫ్లాష్ , సోనీ  IMX362 సెన్సార్ , f/1.7  అపార్చర్ ,  ఫేస్  డిటెక్షన్ ఆటో ఫోకస్  తో వస్తుంది.  రెండవది  5  ఎంపీ కెమెరా . 16  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  వుంది. దీనిలో 4G VoLTE  సపోర్ట్  వుంది.ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లో  పై  ఆధారితమైన   ఫన్  టచ్  ఆపరేటింగ్  సిస్టం  3.0  పై  పని చేస్తుంది.  4080mAh  బ్యాటరీ  , మరియు   బ్లూటూత్  4.2,  వైఫై  802.11 ac, GPS  అండ్  3.5mm  ఆడియో జాక్  వంటి ఫీచర్స్ కలవు .  దీని  థిక్  నెస్  8.4mm  మరియు బరువు 178  గ్రాములు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo