వివో ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo X90 Series ను విడుదల చెయ్యడానికి రెడీ అయ్యింది. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను ప్రీమియం ఫీచర్లు మరియు టాప్ కెమేరా సెటప్ తో అందించబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్ధం అవుతోంది. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను టీజర్ ద్వారా అందించింది. Vivo X90 Series యొక్క టీజ్డ్ ఫీచర్లు మరియు అంచనా స్పెక్స్ ఏమిటో చూద్దామా.
ఫిబ్రవరి 26న ఇండియాలో లాంచ్ కానున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా Vivo X90 Series స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని వివరాలను గురించి టీజింగ్ చేస్తోంది.
Vivo X90 Series స్మార్ట్ ఫోన్ లను ఎప్పటిలాగానే ZEISS అనుబంధంతో తీసుకువస్తునట్లు తెలిపింది. ఇందులో కెమేరా సెటప్ ను Zeiss Variso – Tessar అనుసంధాన ఫీచర్ తో ఉన్నట్లు టీజింగ్ ఇమేజ్ చూపిస్తోంది.
ఈ కెమేరా సెటప్ లో Zeiss 1 ఇంచ్ మైన్ కెమేరా ఉన్నట్లు తెలిపింది. ఇది మరింత వెలుగును స్వీకరించడం ద్వారా ప్రతీ నైట్ షాట్ ను మరింత క్లారిటీ, ప్యూరిటీ మరియు అద్భుతంగా చేయగలదని వివో ఈ ఫోన్ గురించి పొగుడుతోంది. అంతేకాదు, ఈ కెమేరాని 1 గ్లాస్ మరియు 7 ప్లాస్టిక్ లెన్స్ లతో కూడిన 8P తో ఉన్నట్లు, ఇది CIPA Level 4 OIS సపోర్ట్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలిపింది.
టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 30fps వద్ద నైట్ 4K వీడియో లను క్యాప్చర్ చేసే సత్తా కలిగి ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే, ఇమేజ్ లో సముద్రం పైన ఉన్న ఫుల్ మూన్ ని 4K / 30fps వీడియో రికార్డ్ లో చూపించింది. ఈ ఫోన్ లో వెనుక టోటల్ 4 కెమేరాలు ఉన్నాయి.
Vivo X90 Series స్మార్ట్ ఫోన్ లలో కర్వ్డ్ డిస్ప్లే ఉన్నట్లు కూడా ఈ టీజర్ ఇమేజ్ చూపించింది. అయితే, Vivo X90 Series లాంచ్ కోసం ఇంకా రెండు రోజుల సమయం ఉన్నది కాబట్టి మరిన్ని వివరాలను టీజర్ ద్వారా వెల్లడించవచ్చని భావిస్తున్నారు.