భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో వచ్చిన Vivo X90 Pro పైన ఒక లుక్కేద్దామా.!

భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో వచ్చిన Vivo X90 Pro పైన ఒక లుక్కేద్దామా.!
HIGHLIGHTS

Vivo X90 Series నుండి X90 మరియు X90 Pro ప్రీమియం ఫోన్ లను విడుదల

Vivo X90 Pro భారీ ఆఫర్లతో లాంచ్ చేయబడింది

ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి సవివరంగా తెలుసుకుందాం

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో ఇండియాలో Vivo X90 Series నుండి X90 మరియు X90 Pro ప్రీమియం ఫోన్ లను విడుదల చేసింది. వీటిలో, Vivo X90 Pro ప్రీమియం స్పెక్స్, ఫీచర్స్ తో పాటుగా భారీ ఆఫర్లతో కూడా లాంచ్ చేయబడింది. అందుకే, ఈరోజు ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి సవివరంగా తెలుసుకుందాం. 

Vivo X90 Pro: ధర & ఆఫర్స్

వివో ఎక్స్90 ప్రో స్మార్ట్ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వచ్చింది మరియు దీని ధర రూ. 84,999. అయితే. వివో ఈ ఫోన్ తో మంచి ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా జతచేసింది. ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ తో కొనే వారికి రూ. 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 

అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 8,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది. అయితే, ఇది వివో V & X సిరీస్, శామ్సంగ్ S,A & Note సిరీస్, OnePlus ఫోన్స్, Oppo Reno సిరీస్ ఫోన్ల కు మాత్రమే వర్తిస్తుంది. ఇతర ఫోన్ల పైన రూ. 3,000 ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. 

ఈ ఫోన్ తో మీరు రూ. 1,999 విలువైన XE710 ఇయర్ ఫోన్ లను ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ ఫోన్ ను Vivo e-Store నుండి మే 11వ లోపు కొనే వారికి మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది.

ప్రస్తుతం Flipkart మరియు Vivo ఇ స్టోర్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ Pre-Order కి అందుబాటులో వుంది. 

Vivo X90 Pro: స్పెక్స్ & ఫీచర్స్ 

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% DCI-P3 మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది.

ఈ వివో ప్రీమియం ఫోన్ మీడియాటెక్ Dimensity 9200 5G 4nm ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256 GB (UFS 4.0)స్టోరేజ్ సపోర్ట్ లను కలిగి వుంది. 

ఈ ఫోన్ లో భారీ కెమేరా సెటప్ అందించింది. ఈ ఫోన్ లో మూడు Sony ప్రీమియం సెన్సార్ లను అందించింది. ఇందులో, 1 ఇంచ్ Zeiss 50MP OIS (IMX989) కెమేరా, OIS సపోర్టెడ్ 50 పోర్ట్రైట్ (IMX758) మరియు 12MP అల్ట్రా వైడ్ (IMX663) కెమెరాలను లేజర్ ఫోకస్ సెన్సార్ తో కలిగి వుంది. ఈ కెమెరాతో 4K వీడియోలను 30fps/60fps వద్ద మరియు 8K వీడియోలను 24 fps వద్ద చిత్రీకరించవచ్చని కంపెనీ తెలిపింది. 

ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ 120W డ్యూయల్ సెల్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4870 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13OS ఆధారితమైన Funtouch OS 13 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo