ఈరోజు ఇండియాలో వివో తన ప్రీమియం స్మార్ట్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వివో చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న Vivo X90 Series స్మార్ట్ ఫోన్లను ఈరోజు విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి Vivo X90 మరియు Vivo X90 Pro స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. వివో యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో వివో ఎక్స్90 బేసిక్ ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.
ముందుగా సిరీస్ లో బేసిక్ ఫోన్ అయిన Vivo X90 ధర మరియు స్పెక్స్ చూద్దాం. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB+128GB) ధర రూ. 59,999 మరియు 12GB మరియు 256GB హైఎండ్ వేరియంట్ ధర రూ. 63,999 గా ప్రకటించింది. ఈ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది.
ఆఫర్స్: ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ తో కొనేవారికి రూ. 5,500 రూపాయల డిస్కౌంట్ అఫర్ ను అందించింది. ఈ ఫోన్ పైన 6,000 సెలెక్టెడ్ ఫోన్ల పైన 6000 రూపాయల వరకూ ఎక్స్ చేంజ్ అఫర్ ను అందించింది. అయితే, ఈ ఎక్స్ చేంజ్ అఫర్ వివో స్టోర్ నుండి ఈ ఫోన్ ను కొనే వారికి మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
వివో ఎక్స్90 స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ FHD+ AMOELD డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ తో కలిగి వుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ Dimensity 9200 ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256 (UFS 4.0) ఫాస్ట్ స్టోరేజ్ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారితమైన Funtouch OS 13 సాఫ్ట్ వేర్ పై పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో అందించి కెమేరాల గురించి కంపెనీ చాలా గొప్ప చెబుతోంది. ఈ ఫోన్ లో మూడు సోనీ సెన్సార్ మరియు లేజర్ ఫోకస్ సెన్సార్ లతో కూడిన కెమేరా అందించింది. ఇందులో 50MP (IMX866) ప్రధాన కెమేరా, 12MP (IMX663) ప్రొఫెషనల్ పోర్ట్రైట్ కెమేరా, 12MP (IMX663) వైడ్-యాంగిల్ కెమేరా ఉన్నాయి.
ఫోటోలను మరింత అద్భుతంగా అందించాడని ప్రత్యేకంగా V2 చిప్ సెట్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ కెమేరాతో 720P/1080P మరియు 4K వీడియోలను 30/60 fps వద్ద రికార్డ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో చాలా రకాలైన సీన్ మోడ్ లను కూడా జత చేసింది.
ఈ ఫోన్ లో చాలా వేగవంతమైన 120W డ్యూయల్-సెల్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4810 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, X-Axis Linear మోటార్ వంటి ఫీచర్లను కలిగి వుంది.