200MP ZEISS కెమెరాతో లాంచ్ కి రెడీ అయిన vivo X200 series స్మార్ట్ ఫోన్స్.!

200MP ZEISS కెమెరాతో లాంచ్ కి రెడీ అయిన vivo X200 series స్మార్ట్ ఫోన్స్.!
HIGHLIGHTS

vivo X200 series ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అవుతోంది

ఈ ఫోన్ యొక్క లాంచ్ అనౌన్స్ చేస్తూ వివో టీజర్ విడుదల చేసింది

00MP ZEISS కెమెరాతో లాంచ్ కి రెడీ అయినట్లు కంపెనీ టీజ్ చేస్తుంది

గ్లోబల్ మార్కెట్ వివో రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ vivo X200 series ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ అనౌన్స్ చేస్తూ వివో టీజర్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన 200MP ZEISS కెమెరాతో లాంచ్ కి రెడీ అయినట్లు కంపెనీ టీజ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ గురించి వివో టీజింగ్ చేస్తున్న ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.

vivo X200 Series : లాంచ్

వివో విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ ని మాత్రం కంపెనీ బయటపెట్టింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజితో ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది.

vivo X200 Series : కీలకమైన స్పెక్స్

వివో ఎక్స్ 200 సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో, ఎక్స్ 200 మరియు ఎక్స్ 200 ప్రో స్మార్ట్ ఫోన్ లు ఉంటాయి. వీటిలో, ఎక్స్ 200 ప్రో స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న కీలకమైన ప్రత్యేకతలు మరియు ఫీచర్లలో వివో టీజర్ పేజీ ద్వారా బయట పెట్టింది.

vivo X200 series launching soon

ఎక్స్ 200 ప్రో స్మార్ట్ ఫోన్ లో 200MP ZEISS కెమెరా ఉన్నట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఎక్స్ 200 ప్రో మోడల్ లో 600 mAh సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ఉందని కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు ఫీచర్స్ తో ఇండియాలో వచ్చే మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా వివో గొప్పగా చెబుతోంది.

Also Read: boAt Airdopes 141 Pro: సరికొత్త మెటాలిక్ ఫినిష్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!

ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లో క్వాడ్ కర్వుడ్ స్క్రీన్, లేటెస్ట్ FunTouch 15 OS మరియు AI సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ సిరీస్ ను మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400 ఉన్నట్లు కూడా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించడానికి వీలుగా V3+ చిప్ సెట్ ను కూడా జతగా అందించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు మరిన్ని ఇతర కీలకమైన ఫీచర్స్ ను త్వరలోనే వివో వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo