Vivo X200 Series ఇండియా లాంచ్ డేట్ ను వివో అనౌన్స్ చేసింది. భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో వివో లాంచ్ చేయనున్న వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ సిరీస్ నుంచి లాంచ్ కాబోతున్న ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో కూడా కంపెనీ టీజింగ్ చేస్తోంది.
వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ X200 Series ను భారత మార్కెట్ లో డిసెంబర్ 12వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్ మరియు మరిన్ని భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది.
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ మీడియాటెక్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 9400 మరియు జతగా V3+ ఇమేజింగ్ చిప్ తో అందిస్తుంది. ఈ ఫోన్ ను గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుందని వివో గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ ZEISS ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ సెటప్ లో 200MP ZEISS APO టెలిఫోటో సెన్సార్ వుంది. ఇది చాలా గొప్ప ఫోటోలు అందిస్తుందని కూడా వివో తెలిపింది.
ఈ ఫోన్ చాలా సన్నగా మరియు నాజూకుగా ఉంటుంది. అయినా, ఈ ఫోన్ పెద్ద 6000 mAh సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను FunTouch 15 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వివో ప్రకటించింది. ఈ వివో అప్ కమింగ్ సిరీస్ లో AI సపోర్ట్ ఉన్నట్లు కూడా వివో కన్ఫర్మ్ చేసింది.
Also Read: TWS Buds Deals: 2 వేల బడ్జెట్ లో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ ఫోన్ ప్రోసెసర్ అనుసారం ఈ ఫోన్ లో LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యే అవకాశం వుంది.