vivo X200 Series గ్లోబల్ లాంచ్ ప్రకటించిన కంపెనీ: ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే.!
vivo X200 Series గ్లోబల్ లాంచ్ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ వివో అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ రూమర్డ్ ఫీచర్స్ మరియు వివరాలు నెట్టింట్లో నిన్నటి వరకూ హోరెత్తించగా, ఇప్పుడు ఈ ఫోన్ అఫీషియల్ లాంచ్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ ను మలేషియాలో ముందుగా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది మరియు ఈ ఫోన్ మలేషియా యొక్క SIRIM సర్టిఫికేషన్ ప్లాట్ ఫామ్ లో లిస్ట్ కూడా అయ్యింది.
vivo X200 Series : లాంచ్
వివో ఎక్స్ 200 సిరీస్ ఈ నెలలో మలేషియా మార్కెట్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ముందుగా మలేషియా మార్కెట్లో లాంచ్ చేసిందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది మరియు ఈ ఫోన్ ఇప్పటికే ఇక్కడి సర్టిఫికేషన్ లిస్ట్ లో కూడా చేరింది.
vivo X200 Series ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వివో ఎక్స్ 200 సిరీస్ ఇండియా లాంచ్ డేట్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి అఫీషయల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే, గతంలో కంపెనీ ఫాలో అయిన స్ట్రాటజీ ప్రకారం, ఈ ఫోన్ అతి త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ నుని వివో ఎక్స్ 200 మరియు ఎక్స్ 200 ప్రో ఫోన్లు ఉంటాయని చెబుతున్నారు.
వివో ఎక్స్ 200 సిరీస్ : అంచనా ఫీచర్స్
వివో ఎక్స్ 200 సిరీస్ అంచనా ఫీచర్స్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Dimensity 9400 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం వుంది. దీనికి జతగా LPDDR5X ర్యామ్ మరియు UFS 4.0 ఫాస్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి.
ఈ ఫోన్ లో అధిక రిజల్యూషన్ (1.5K) కలిగిన 6.7 ఇంచ్ OLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ లో 50MP (Sony IMX921) మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వాడి మరియు 50MP టెలిఫోటో సెన్సార్ కలిగిన పవర్ ఫుల్ కెమెరా సెటప్ వుండే అవకాశం ఉంటుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 28 వేలకే లభిస్తున్న Google Pixel 7a స్మార్ట్ ఫోన్.!
మొత్తానికి, వివో అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు.