Vivo X200 Launched: ధర మరియు టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!

Vivo X200 Launched: ధర మరియు టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

వివో ఈరోజు రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

Vivo X200 బేసిక్ మోడల్ గా అందించింది

ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 8T LTPS AMOLED స్క్రీన్ ను అందించింది

Vivo X200 Launched: వివో ఈరోజు ఇండియాలో రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఇందులో వివో X200 బేసిక్ మోడల్ గా మరియు వివో X200 ప్రో ని హై ఎండ్ మోడల్ గా అందించింది. ఈ రెండు ఫోన్లలో బేసిక్ మోడల్ అయిన వివో X200 ధర మరియు టేప్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Vivo X200 Launched: ధర

వివో X200 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ (12GB +256GB) వేరియంట్ ను రూ. 65,999 ధరతో, హైఎండ్ (16GB +512GB) వేరియంట్ ను రూ. 71,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను నాచురల్ గ్రీన్ మరియు కాస్మోస్ బ్లాక్ రెండు కలర్స్ లో లభిస్తుంది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ పై HDFC, SBI మరియు ICICI క్రెడిట్ కార్డ్ ఫుల్ స్వైప్ మరియు EMI ట్రాన్సాక్షన్ పై రూ. 7,200 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. వివో ఫోన్ల పై గరిష్టంగా రూ. 9,500 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ అందిస్తుంది.

Vivo X200 Launched

Vivo X200 టాప్ 5 ఫీచర్స్

Display

ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 8T LTPS AMOLED స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు Netflix HDR సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Processor

ఈ వివో ప్రీమియం ఫోన్ ను MediaTek లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9400 తో అందించింది. ఇది 3nm చిప్ సెట్ మరియు ఇది గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Ram & Storage

ఈ ఫోన్ లో గొప్ప ర్యామ్ మరియు స్టోరేజ్ లను అందించింది. ఈ వివో కొత్త ఫోన్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో అందించింది. ఈ సెటప్ ఫోన్ ను మరింత వేగంగా మారుస్తుంది.

Camera

వివో X200 స్మార్ట్ ఫోన్ భారీ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX921 మెయిన్, 50MP (JN1) వైడ్ యాంగిల్ మరియు 50MP (Sony IMX882) టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ రెండు కెమెరాలు కూడా 60fps వద్ద 4K Video రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటాయి.

ఈ ఫోన్ కెమెరా సిస్టం ZEISS ఆప్టిక్స్ తో గొప్ప క్వాలిటీ ఫోటోలు కూడా అందిస్తుంది. అంతేకాదు, సూపర్ ల్యాండ్ స్కేప్ తో ఇండియాలో లాంచ్ అయిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది.

Battery & Charging

ఈ ఫోన్ 5800 mAh 3rd-Gen సిలికాన్ యానోడ్ సెమీ సాలిడ్ స్టేట్ పవర్ ఫుల్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ ను చాలా వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జ్ టెక్ ను కూడా ఇందులో సపోర్ట్ గా అందించింది.

Also Read: OnePlus Community Sale నుంచి ఈ ఫోన్స్ పై వన్ ప్లస్ బడ్స్ ఉచితంగా అందిస్తోంది.!

ఈ 5 ఫీచర్స్ కూడా ఈ ఫోన్ ను ఆకట్టుకునేలా చేస్తున్నాయి. మరొక ప్రధాన ఫీచర్ కూడా ఈ ఫోన్ లో వుంది. అదేమిటంటే, ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ ను కలిగి వుంది. అంటే, ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉండటమే కాకుండా ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో అయినా తట్టుకొని నిలబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo