Vivo X100s Pro: 8K UHD కెమెరా మరియు Dimensity 9300+ చిప్ సెట్ తో వచ్చింది.!

Vivo X100s Pro: 8K UHD కెమెరా మరియు Dimensity 9300+ చిప్ సెట్ తో వచ్చింది.!
HIGHLIGHTS

వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త ఫోన్లను విడుదల చేసింది

వివో X100s మరియు వివో X100s ప్రో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

Vivo X100s Pro ఫోన్ 8K UHD కెమెరా సెటప్ తో వచ్చింది

Vivo X100s Pro: వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో X100 సిరీస్ నుంచి వివో X100s మరియు వివో X100s ప్రో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ ఫోన్ లను మతిపోగొట్టే ఫీచర్స్ మరియు స్పెక్స్ తో చైనీస్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో, వివో X100 s ప్రో స్మార్ట్ ఫోన్ 8K UHD కెమెరా మరియు Dimensity 9300+ చిప్ సెట్ వంటి మరిన్ని భారీ ఫీచర్స్ తో వచ్చింది.

Vivo X100s Pro: ప్రత్యేకతలు

వివో ఫ్లాగ్ షిప్ సిరీస్ నుండి వచ్చిన ఈ ప్రో స్మార్ట్ ఫోన్ వివో 100Xs ప్రో స్మార్ట్ ఫోన్ గొప్ప ఫీచర్స్ కలిగి వుంది. ఈ వివో ఫోన్ 6.78 ఇంచ్ 8T LTPO Curved డిస్ప్లేని 2800 × 1260 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 1-120 అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది, ఈ ఫోన్ IP69 మరియు IP68 మల్టీ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ లతో వస్తుంది.

8K UHD Camera

ఈ ఫోన్ ను 50MP+ 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం తో లాంచ్ చేసింది. ఇందులో 1 ఇంచ్ 50MP మెయిన్, 50MP Zeiss APO సూపర్ టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉన్నాయి. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

Vivo X100s Pro 8K UHD Camera
Vivo X100s Pro 8K UHD Camera

ఈ కెమెరా 100x డిజిటల్ Zoom, టన్నుల కొద్దీ ఫిల్టర్స్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరాతో 8K UHD వీడియో లను మరియు అద్భుతమైన ఫోటోలను షూట్ చెయ్యగలదని వివో తెలిపింది. ఈ కెమెరా Zeiss ఆప్టిక్స్ తో కూడా వస్తుంది.

Also Read: ఈరోజు Amazon గొప్ప డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న 55 ఇంచ్ Smart TV పై ఒక లుక్కేయండి.!

ఈ ఫోన్ లో Bluetooth 5.4, Fi 6 మరియు Wi-Fi 7 వంటి లేటెస్ట్ ఫీచర్స్ సపోర్ట్ వుంది. ఈ ఫోన్ లో OriginOS 4 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5400 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది.

Vivo X100s Pro: Price (చైనా)

వివో X100s ప్రో స్మార్ట్ ఫోన్ ను చైనాలో CNY 4999 (సుమారు రూ. 57,700) ధరతో విడుదల చేసింది. ఇది 12GB + 256GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ యొక్క 16GB + 512GB వేరియంట్ ను CNY 5599 (సుమారు రూ. 64,700) ధరతో, 16GB + 1TB వేరియంట్ ను CNY 6199 (సుమారు రూ. 71,500) ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo