Vivo X100 Series: భారీ ఫీచర్స్ తో వచ్చిన వివో New ఫోన్లు | Tech News

Vivo X100 Series: భారీ ఫీచర్స్ తో వచ్చిన వివో New ఫోన్లు | Tech News
HIGHLIGHTS

Vivo X100 Series నుండి వివో కొత్త ఫోన్లను విడుదల చేసింది

వివో ఎక్స్ 100 మరియు ఎక్స్ 100 ప్రో రెండు ఫోన్లను లాంచ్ చేసింది

ఈ రెండు ఫోన్లు కూడా భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో వచ్చాయి

Vivo X100 Series నుండి వివో కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఈ వివో ఎక్స్ 100 సిరీస్ నుండి వివో ఎక్స్ 100 మరియు ఎక్స్ 100 ప్రో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ తో చైనా మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేయబడ్డాయి. వివో ఎక్స్ 100 సిరీస్ నుండి వచ్చిన ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా MediaTek లేటెస్ట్ పవర్ ఫుల్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ Dimensity 9300 తో వచ్చిన మొదటి ఫోన్ లుగా నిలిచాయి. ఈ కొత్త ఫోన్స్ మరియు వాటి ప్రత్యేకతలు ఏమిటో చూద్దామా.

Vivo X100 Series Specs

ఈ వివో కొత్త స్మార్ట్ ఫోన్లు భారీ స్పెక్స్ మరియు ఫీచర్స్ తోనే మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు కూడా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించా గల 6.78 ఇంచ్ 8T LTPO కర్వ్డ్స్ డిస్ప్లేని 2800×1260 రిజల్యూషన్ తో కలిగి ఉన్నాయి. ఇది 10బిట్ డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే, ఈ రెండు వివో కొత్త ఫోన్లు కూడా MediaTek Dimensity 9300 ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ మరియు 16GB LPDDR5T RAM తో పాటు జతగా 1TB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో వస్తాయి.

Vivo X100 Series Specs
వివో ఎక్స్ 100 సిరీస్

అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కెమేరా మరియు ఛార్జ్ టెక్ లలో మార్పులు ఉంటాయి. వివో ఎక్స్ 100 ఫోన్ లో వెనుక 50MP VCS బయోనిక్ సెన్సార్ + 64MP Zeiss సూపర్ టెలిఫోటో + 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ కెమేరా కలిగి వుంది. అయితే, వివో ఎక్స్100 ప్రో లో వెనుక 50MP OIS (Sony IMX989) + 50MP Zeiss APO సూపర్ టెలిఫోటో సెన్సార్ + 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లు కలిగిన ట్రిపుల్ కెమేరాతో వస్తుంది.

వివో ఎక్స్100 ఫోన్ 4K వీడియో రికార్డింగ్ తో సపోర్ట్ వస్తే ఎక్స్100 ప్రో మాత్రం 8K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ తో వస్తుంది. వివో ఎక్స్100 ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తే, వివో ఎక్స్100 ప్రో మాత్రం 100Wవైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ & 50W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

Also Read : Whatsapp Voice Chat: ఇక పెద్ద గ్రూపులలో కూడా వాయిస్ చాట్ | New Update

వివో ఎక్స్ 100 సిరీస్ Price

వివో ఎక్స్ 100 సిరీస్ నుండి విడుదల చేసిన ఈ రెండు కొత్త ఫోన్ల ధరల విషయానికి వస్తే, వివో ఎక్స్ 100 స్టార్టింగ్ వేరియంట్ (12GB + 256GB) CNY 3,999 (సుమారు రూ. 47,000) ధరతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (16GB LPDDR5T + 1TB) CNY 5,099 (సుమారు రూ. 60,000) ధరతో వచ్చింది.

ఇక వివో ఎక్స్ 100 ప్రో విషయానికి వస్తే, ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (12GB + 256GB) ధర CNY 4,999 (సుమారు రూ. 59,000). అలాగే, ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (16GB RAM + 1TB) ధర CNY 5,999 (సుమారు రూ. 70,000) గా వుంది.

ఇమేజ్ క్రెడిట్ : వివో చైనా వెబ్సైట్

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo