భారీ కెమేరా సెటప్ గల vivo X100 Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్న వివో. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇండియా లాంచ్ గురించి వివో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించనప్పటికీ, ‘Coming Soon’ ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లతో టీజింగ్ మొదలు పెట్టింది. వాస్తవానికి, ఈ ఫోన్ చైనా మార్కెట్ లో ముందే విడుదలయ్యింది మరియు గొప్ప సేల్ లను కూడా సాధించింది. ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ చెబుతున్న వివరాలు ఏమిటో చూద్దామా.
వివో ఎక్స్100 సిరీస్ ను త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. వివో ఎక్స్100 సిరీస్ నుండి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ ఇమేజ్ లతో కంపెనీ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా ఈ ఫోన్ కెమేరా మరియు డిజైన్ వివరాలను వెల్లడించే ప్రయంత్నం చేసింది.
ఈ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా వివరాలను టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ గురించి వివో సింపుల్ గా ‘Next Level Imaging’ అని చెబుతోంది. అంటే, ఈ ఫోన్ కెమేరాలను గురించి కంపెనీ అంత గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ యొక్క కెమేరాతో తీసినట్లు చెబుతూన్న ఫోటో ను కూడా టీజర్ పేజ్ ద్వారా అందించింది. ఇందులో, అందించిన బిగ్ సెటప్ లో Zeiss APO సరిఫైడ్ టెలిఫోటో కెమేరా వుంది.
Also Read: Realme C67 5G First Sale: రియల్ మి కొత్త ఫోన్ మొదటిసారి సేల్ కి వస్తోంది.!
ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesity 9300 & Vivo V3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ లో 8T LTPO ఐప్రొటెక్షన్ డిస్ప్లే, 5400 mAh బిగ్ బ్యాటరీని 100W డ్యూయల్ సెల్ ఫ్లాష్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చెయ్య లేదు కాబట్టి, ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లను ఒక్కోక్కటిగా రివీల్ చేసే అవకాశం ఉంటుంది.