50MP + 50MP + 50MP తో వచ్చిన vivo X100 Pro ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

50MP + 50MP + 50MP తో వచ్చిన vivo X100 Pro ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
HIGHLIGHTS

vivo X100 Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది

50MP + 50MP + 50MP వంటి భారీ కెమేరా సెటప్ తో ప్రవేశపెట్టింది

వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్ ను భారీ ప్రత్యేకతలతో లాంచ్ చేసింది

వివో చాలా రోజులుగా టీజింగ్ చేస్తూ వస్తున్న vivo X100 Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 50MP + 50MP + 50MP వంటి భారీ కెమేరా సెటప్ మరియు అద్భుతమైన కెమేరా ఫీచర్స్ తో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేసిన వివో, ఈరోజు ఈ ఫోన్ ను ఇండియాలో కూడా విడుదల చేసింది. వివో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.

vivo X100 Pro Price

వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 89,999 ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ 16GB + 512GB సింగిల్ వేరియంట్ తో వచ్చింది మరియు ఆస్ట్రాయిడ్ బ్లాక్ సింగిల్ కలర్ ఆప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ పైన HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ లతో ఈ ఫోన్ ను కొనే వారికి రూ. 8,999 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్ తో ఎక్స్ చేంజ్ పైన మోడల్ ను బట్టి రూ. 4,000 రూపాయల నుండి రూ. 8,000 రూపాయల వరకూ అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందిస్తోంది.

Also Read : Redmi Note 13 5G: ఈ టాప్ 5 ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో లాంఛ్ అయ్యింది.!

వివో ఎక్స్100 ప్రో ప్రత్యేకతలు

వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్ ను భారీ ప్రత్యేకతలతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అత్యంత వేగవంతమైన MediaTek లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 9300 తో లాంచ్ చేసింది. ఇది LPDDR5X 16GB RAM మరియు 512GB (UFS 4.0) హెవీ అంతర్గత మెమెరీతో జత చెయ్యబడి చాలా స్మూత్ గా మరియు వేగవంతంగా ఉంటుంది.

ఈ ఫోన్ Funtouch OS 14 సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన పని చేస్తుంది మరియు 100W Flash Charge సపోర్ట్ కలిగిన 5400mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది వివో.

ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 8T LTPO AMOLED డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 105% NTSC కలర్ శాచురేషన్ మరియు 100% DCI-P3 కలర్ గ్యామ్యూట్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ కెమేరాల పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో, 50 MP (Sony IMX989) + 50 MP అల్ట్రా వైడ్ + 50 MP టెలిఫోటో గల Zeiss ట్రిపుల్ రియర్ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా కోసం వివో యొక్క ప్రత్యేకమైన V3 చిప్ సెట్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ తో 4K Cinematic Portrait Video లను, 4K నైట్ వీడియోలను మరియు అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించ గలిగే సత్తాని కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 32 MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo