Vivo X Fold 3 Pro: రేపు లాంచ్ అవుతున్న వివో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకోండి.!
ఇండియాలో ఇప్పటివరకు ఫోల్డ్ లను అందించని వివో
ఇప్పుడు మొదటిసారిగా ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది
Vivo X Fold 3 Pro ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తోంది
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఇప్పటివరకు ఫోల్డ్ లను అందించని వివో, ఇప్పుడు మొదటిసారిగా ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు సూపర్ ఫీచర్స్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రేపు లాంచ్ అవుతున్న వివో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ముందే తెలుసుకోండి.
Vivo X Fold 3 Pro: ప్రత్యేకతలు
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఫోన్ ను మడత పెట్టినప్పుడు కేవలం 11.2mm మందతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం 236 గ్రాముల బరువు ఉంటుంది. ఈ వివో ఫోల్డ్ ఫోన్ సెలెస్టియల్ బ్లాక్ కలర్ లో ఎలిగెంట్ లుక్ తో ఉంటుంది. ఈ ఫోన్ రోజుకు 100 ఫోల్డ్స్ చొప్పున మడత పెట్టినా కూడా 12 సంవత్సరాల వరకూ ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా వివో భరోసా ఇస్తోంది. దీనికోసం ఈ ఫోన్ లో అల్ట్రా డ్యూరబుల్ కార్బన్ ఫైబర్ హింజ్ ను అందించింది.
ఈ ఫోన్ గూగుల్ పవర్డ్ Gemini AI ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ Zeiss టెలీఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్ కలిగిన మొదటి ఫోల్డ్ ఫోన్ అవుతుందని కంపెనీ గొప్పగా చెబుతోంది.
Also Read: Jio: ఎంటర్టైన్మెంట్, 18GB ఎక్స్ట్రా డేటాతో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ గురించి కూడా వివో గొప్పగా చెబుతోంది. ఇండియాలో ఇప్పటి వరకూ వచ్చిన ఫోల్డ్ ఫోన్ లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫోన్ ను 5700 mAh బిగ్ బ్యాటరీతో తీసుకు వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన పెద్ద బ్యాటరీని మరింత వేగంగా ఛార్జ్ చేసే ఛార్జ్ టెక్ ను కూడా ఇందులో అందించిందిట. ఈ ఫోన్ లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది.
ఈ ఫోన్ డిస్ప్లే కూడా గొప్ప ప్రత్యేకతలతో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా అర్ధం అవుతోంది. రేపు ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల అవుతుంది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.