Vivo V9 భారత్ లో ఈరోజు లాంచ్ : ఇక్కడ చూడండి ఈ ఈవెంట్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ …

Updated on 23-Mar-2018

Vivo Vivo V9 స్మార్ట్ఫోన్ ని మార్చి 23న  భారతదేశంలో ప్రారంభించనుంది, కంపెనీ  ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ గురించి సమాచారం అందించింది, ఇది ఒక నాచ్ మరియు డ్యూయల్  కెమెరా సెటప్ తో వుంది  అన్నారు. అయితే ఇప్పుడు వివో థాయిలాండ్ వెబ్సైట్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ గురించి కొంత సమాచారం అందించింది . నేడు భారత దేశంలో ఈ స్మార్ట్ఫోన్ ని  1 PM వద్ద ప్రారంభించవచ్చని సమాచారం , ఈ ప్రత్యక్ష ప్రసారం  మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి కంపెనీ అధికారిక వెబ్సైట్ను మీరు సందర్శించవచ్చు. దీనితో పాటు, మేము YouTube ప్రత్యక్ష ప్రసార లింక్ని కూడా జోడించాము.

కంపెనీ  ఇప్పటికే థాయిలాండ్ లో తన  వివో V9 స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించింది. మరియు ఈ స్మార్ట్ఫోన్ గురించి  సమాచారం అంత ఇక్కడ ఉంది. ఈ స్మార్ట్ఫోన్ డిజైన్  భారతదేశంలో కూడా  అదే విధంగా ఉంటుంది, కానీ దాని స్పెక్స్  లో వ్యత్యాసం ఉండవచ్చు .

భారతదేశంలో అమెజాన్ ఇండియాలో ఒక టీసింగ్ పేజీ కూడా విడుదల చేయబడింది, ఈ స్మార్ట్ఫోన్లో AI ఆధారిత కెమెరా ఉన్నది వాస్తవం. ఇవే కాకుండా, స్మార్ట్ఫోన్ కోసం ప్రీ-బుకింగ్ ప్రక్రియ నేడు అమెజాన్ ఇండియాలో 3 గంటల నుండి ప్రారంభమవుతుంది.

వివో V9 స్మార్ట్ఫోన్ గురించి ఈ సంవత్సరం అనేక సార్లు లీక్స్ వచ్చాయి . ఈ స్మార్ట్ ఫోన్  క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్  కలిగి ఉందని సమాచారం . దీనితో పాటు, ఈ ఫోన్ థాయ్ ల్యాండ్ లో 4GB RAM మరియు 64GB స్టోరేజ్  వెర్షన్ తో  ప్రారంభించబడింది . దీనితో పాటు, మైక్రో SD కార్డు యొక్క మద్దతుతో దాని స్టోరేజ్ ను 256GB కి పెంచవచ్చు.

అయినప్పటికీ, ప్రత్యేకమైన మైక్రో SD కార్డు స్లాట్  కలిగి ఉందని  సమాచారం . థాయిలాండ్ యొక్క వెబ్సైట్ ద్వారా తెలిసిందేమిటంటే , ఇది 6.3 అంగుళాల IPS LCD డిస్ప్లే నాచ్ తో వస్తుంది. దీని పిక్సెల్ రిజల్యూషన్ 2280x1080p గా చూపించబడింది.

ఈ సెల్ఫీ  ఆధారిత స్మార్ట్ఫోన్లో, ఒక 24-మెగాపిక్సెల్ ముందు కెమెరా దాని వెనుకవైపు డ్యూయల్  కెమెరా సెటప్తోపాటు, f / 2.0 ఎపర్చరు తో  ఉంటుంది. ఈ ఫోన్లో 16 మెగాపిక్సెల్ మరియు 5 మెగాపిక్సెల్ కెమెరా కాంబో ఉన్నాయి. స్మార్ట్ఫోన్ ఒక 3260mAh బ్యాటరీ కలిగి  ఉందని భావిస్తున్నారు, అలాగే అది Android  8.1 Oreo ఫై పనిచేస్తుంది.
అయితే, భారతీయ మార్కెట్ కి వచ్చే ముందు, ఈ స్మార్ట్ఫోన్ లో  ఎటువంటి ప్రధాన మార్పులు లేవు,  ఈ స్మార్ట్ఫోన్ ధర రూ .25,000 ఉంటుంది.

Connect On :