Vivo V50e: అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ మరియు స్టన్నింగ్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo V50e లాంచ్ అనౌన్స్ చేసింది
అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ మరియు స్టన్నింగ్ కెమెరాతో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది
కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ అందించిన టీజర్ నుంచి వివరాలు వెల్లడించింది
Vivo V50e: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే వివో వి50e స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ మరియు స్టన్నింగ్ కెమెరాతో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త కలర్ మరియు బ్యాక్ ప్యానల్ డిజైన్ తో పాటు గొప్ప కెమెరా ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ అందించిన టీజర్ నుంచి వివరాలు వెల్లడించింది.
Vivo V50e: లాంచ్
వివో వి50e స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. అయితే, వివో వి50e స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ మైక్రో సైట్ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ఈ టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా అందించింది.
Vivo V50e: ఫీచర్స్
వివో అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు కంపెనీ అందించింది. వివో వి50e చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ స్క్రీన్ డైమండ్ షీల్డ్ గ్లాస్ రక్షణతో అందించినట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ సరికొత్త సఫైర్ బ్లూ కలర్ లో లాంచ్ అవుతుంది.
వివో వి50e స్మార్ట్ ఫోన్ కెమెరా గురించి వివో చాలా గొప్పగా మరియు ప్రధానంగా చెబుతోంది. ఇందులో డ్యూయల్ రింగ్ కెమెరా మోడ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా మరియు అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇక ముందయితే ఈ ఫోన్ లో 50MP ఐ ఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ మల్టి ఫంక్షనల్ Sony ప్రో పోర్ట్రైట్ ఫోటోలు అందిస్తుందట.
Also Read: Jio Super Offer: కేవలం రూ. 100 కే డేటా మరియు జియో హాట్ స్టార్ 3 నెలల సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!
అలాగే, ఇండియన్స్ కోసం ప్రత్యేకమైన వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రైట్ స్టైల్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అండర్ వాటర్ కెమెరా వంటి మరిన్ని గొప్ప కెమెరా ఫీచర్స్ తో కూడా వస్తుందట. ముఖ్యంగా ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాలు కూడా 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. వివో వి50e ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.