Vivo V40e స్మార్ట్ ఫోన్ Sony ప్రొఫెషనల్ నైట్ పోర్ట్రైట్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!

Updated on 23-Sep-2024
HIGHLIGHTS

Vivo V40e స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 25న ఇండియాలో లాంచ్ చేస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను Sony ప్రొఫెషనల్ నైట్ పోర్ట్రైట్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది

ఈ అప్ కమింగ్ కీలకమైన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేసింది

Vivo V40e స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 25న ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Sony ప్రొఫెషనల్ నైట్ పోర్ట్రైట్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు వివో తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన తీజ్ర పేజి ద్వారా ఈ అప్ కమింగ్ కీలకమైన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేసింది. కంపెనీ అందించిన ఈ ఫీచర్స్ ను చూస్తుంటే, వివో వి40 సిరీస్ నుంచి ముందుగా వచ్చిన వి 40 మరియు వి40 ప్రో మాదిరిగా గొప్ప ఫీచర్ ను కలిగి ఉన్నట్లు అర్థం అవుతోంది.

Vivo V40e : ఫీచర్స్

వివో వి 40e స్మార్ట్ ఫోన్ చాలా సన్నని మరియు తేలికైన డిజైన్ తో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ ఉన్నా కూడా ఈ ఫోన్ లో పవర్ ఫుల్ బ్యాటరీ ఉందని వివో తెలిపింది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీ ఉన్నట్లు వివో తెలిపింది. ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయగలిగిన 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ వుంది. ఇది 98 గంటకే మ్యూజిక్ ప్లే బ్యాక్ మరియు 20 గంటల Youtube ప్లే బ్యాక్ ను అందించే సామర్థ్యం కలియుగ ఉంటుంది.

వివో వి 40e స్మార్ట్ ఫోన్ లో 6.77 ఇంచ్ 3D కర్వుడ్ స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, P3 గ్యామూట్ మరియు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన స్క్రీన్ HDR 10+ సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. అంటే, ఈ ఫోన్ లో గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ ను అందించినట్లు వివో క్లియర్ చేసింది.

కెమెరా పరంగా కూడా ఈ వివో స్మార్ట్ ఫోన్ మంచి సెటప్ నే కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP Sony ప్రొఫెషనల్ నైట్ పోర్ట్రైట్ మెయిన్ సెన్సార్ మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కాలోగ్నా`కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP Eye-AF గ్రూప్ సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ కెమెరాతో గొప్ప ఫోటోలు షూట్ చేయడానికి వీలుగా స్టూడియో క్వాలిటీ Aura Light ని కూడా అందించింది.

Also Read: Amazon Sale నుంచి శామ్సంగ్ GALAXY S23 FE 5G పై భారీ డిస్కౌంట్ అందించింది.!

ఈ ఫోన్ కెమెరాతో ప్రొఫెషనల్ పోర్ట్రైట్, నైట్ పోర్ట్రైట్ మరియు గొప్ప వీడియోలను షూట్ చేయవచ్చని వివో గొప్పగా చెబుతోంది. రెండు రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :