vivo V40 Series: వివో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేయడానికి సిద్ధం అయ్యింది. అదే వివో వి40 సిరీస్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ సిరీస్ నుంచి వివో వి 40 మరియు వి 40 ప్రో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను నాలుగు 50MP పవర్ ఫుల్ కెమెరాలతో తీసుకువస్తున్నట్లు వివో ఆటపట్టిస్తోంది. మరి ఈ అప్ కమింగ్ వివో ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.
వివో వి 40 సిరీస్ ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తుందని మాత్రం తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది మరియు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ ఫోన్ టీజింగ్ ను మొదలు పెట్టింది.
వివో వి 40 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను పూర్తిగా Zeiss కెమెరాలతో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కంపెనీ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Zeiss అల్ట్రా వైడ్ కెమెరా, OIS సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX 921) మెయిన్ కెమెరా మరియు 50MP (Sony IMX 816) టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది.
ఈ నాలుగు కెమెరాలు కూడా Zeiss ఆప్టిక్స్ మరియు ఫిల్టర్స్ సపోర్ట్ ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ 2X ఆప్టికల్ మరియు 50X Zeiss హైపర్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ తో అద్భుతమైన పోర్ట్రైట్ మరియు నైట్ ఫోటో లతో పాటు గొప్ప వీడియోలు పొందవచ్చని వివో తెలిపింది.
Also Read: అతి భారీ డిస్కౌంట్ తో రూ. 17,999 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv
ఇక ఈ వివో 40 సిరీస్ ఫోన్స్ డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గొప్ప డిజైన్ మరియు లుక్స్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన కెమెరా డిజైన్ మరియు Aura లైట్ కూడా వుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ ను కూడా వివో ముందే చేసింది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను లోటస్ పర్పల్, గాంజెస్ బ్లూ మరియు టైటానియం గ్రే మూడు ప్రీమియం కలర్ లలో అందిస్తుందని కూడా వివో టీజ్ చేస్తోంది.