Vivo V40 Series స్మార్ట్ ఫోన్స్ ఇండియా లాంచ్ డేట్ ను వివో అనౌన్స్ చేసింది. ముందుగా ఈ ఫోన్ ఫీచర్స్ మరియు కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ మొదలు పెట్టిన వివో, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను నాలుగు 50MP Zeiss కెమెరాలు మరియు సరికొత్త డిజైన్ వంటి వివరాలతో లాంచ్ చేస్తున్నట్లు వివో ఆటపట్టిస్తోంది.
వివో వి 40 సిరీస్ ను ఆగస్టు 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో వి 40 సిరీస్ నుంచి వి 40 మరియు వి 40 ప్రో రెండు ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కూడా వివో అనౌన్స్ చేసింది.
వివో వి 40 సిరీస్ నుంచి తీసుకు రాబోతున్న స్మార్ట్ ఫోన్స్ సరికొత్త డిజైన్ మరియు మూడు కలర్ లలో కనిపిస్తున్నాయి. ఈ వి 40 సిరీస్ ఫోన్ లను గొప్ప కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు వివో గొప్పగా చెబుతోంది. వివో వి 40 సిరీస్ ఫోన్ లను ZEISS ఆప్టిక్స్ కలిగిన 4 పవర్ ఫుల్ కెమెరాలతో తీసుకువస్తోంది.
ఈ సిరీస్ ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది. ఇందులో 50MP (Sony IMX 921) మొయిన్ కెమెరా, 50MP (Sony IMX 816) టెలీఫోటో జతగా 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. అంటే, ఈ ఫోన్ లో మొత్తంగా నాలుగు 50MP కెమెరాలు ZEISS ఆప్టిక్స్ తో వస్తాయి.
Also Read: FASTag ప్లేస్ లో GNSS: టోల్ ప్లాజా వద్ద లైన్ లకు ఇక స్వస్తి.!
కెమెరా సెటప్ తో పాటు ZEISS కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ ను కూడా జత చేసినట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ 3D కర్వుడ్ డిస్ప్లే ని కలిగి వుంది. అంతేకాదు, IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఈ సిరీస్ ఫోన్ లు ఉంటాయి. ఈ ఫోన్ లను 5500 mAh హెవీ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 80W ఫ్లాష్ ఛార్జ్ 4 ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు కూడా వివో వివరించింది.
ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో మరియు మూడు కొత్త కలర్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ ఫోన్ లను లోటస్ పర్పల్, గంజెస్ బ్లూ మరియు టైటానియం గ్రే మూడు కలర్ లలో విడుదల చేస్తోంది.