ఈరోజు నుంచి మొదలైన vivo V40 5G Series సేల్: ప్రైస్ మరియు ఆఫర్లు తెలుసుకోండి.!
vivo V40 5G Series మొదటి సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
సరికొత్త డిజైన్, గొప్ప ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి
ఈరోజు సేల్ నుంచి ఈ ఫోన్స్ పై భారీ బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తాయి
వివో ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన vivo V40 5G Series మొదటి స్లే ఈరోజు నుంచి మొదలయ్యింది. సరికొత్త డిజైన్, గొప్ప ఫీచర్స్ మరియు స్పెక్స్ తో వివో తెచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లు ఈరోజు నుంచి సేల్ కు అందుబాటులోకి వచ్చాయి. వివో యొక్క ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్ల సేల్: ప్రైస్ మరియు ఆఫర్లు తెలుసుకోండి.
vivo V40 5G Series : సేల్
వివో వి40 సిరీస్ ను నుంచి వి40 మరియు వి40 ప్రో రెండు ఫోన్లు వివో ఇండియాలో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ల ధరలు ఇక్కడ చూడవచ్చు.
వివో వి 40 : ధర
వివో వి 40 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 34,999 ధరలో 8GB + 128GB స్టోరేజ్ తో వచ్చింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ రూ. 36,850 ధరలో 8GB + 256GB స్టోరేజ్ తో వచ్చింది. వి 40 యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB + 512GB స్టోరేజ్ తో రూ. 41,999 ధరతో వచ్చింది.
వివో వి 40 ప్రో : ధర
వివో వి 40 ప్రో స్మార్ట్ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ రూ. 49,999 ధరతో లాంచ్ అయ్యింది. వి 40 ప్రో యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB + 512GB స్టోరేజ్ తో రూ. 55,999 ధరతో లాంచ్ అయ్యింది.
ఆఫర్స్:
వివో ఈ రెండు కొత్త ఫోన్ లను కూడా మంచి ఆఫర్స్ తో విడుదల చేసింది. వివో 40 పైన ఆల్ బ్యాంక్ కార్డ్స్ పై రూ. 3,700 తగ్గింపు ఆఫర్ ను అందించింది. అలాగే, వివో వి 40 ప్రో స్మార్ట్ ఫోన్ తో ఆల్ బ్యాంక్ కార్డ్స్ పై రూ. 5,600 తగ్గింపు అఫర్ ను అందించింది. ఈ ఫోన్ లను Flipkart, vivo.com మరియు అధీకృత స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
Also Read: Jio New Plan: రూ. 198 కే అన్లిమిటెడ్ 5G డేటా మరియు కాలింగ్ తో కొత్త ప్లాన్ తెచ్చింది.!
vivo V40 5G Series : ఫీచర్స్
వివో ఈ ఫోన్ లను సరికొత్త డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ తో అందించింది. వివో వి40 మరియు వివో వి 40 ప్రో స్మార్ట్ ఫోన్ లు 6.7 ఇంచ్ Curved AMOLED స్క్రీన్ ని కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా FHD+ రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ న కలిగి ఉంటాయి. వివో వి 40 స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen ప్రోసెసర్ తో వస్తే, వి40 ప్రో స్మార్ట్ ఫోన్ మాత్రం Dimensity 9200+ ఫాస్ట్ ప్రోసెసర్ తో వచ్చింది. ఈ రెండు ఫోన్లు కూడా 8GB / 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ లను కలిగి ఉన్నాయి.
ఈ రెండు ఫోన్స్ కెమెరా విభాగాల్లో కూడా వ్యత్యాసం వుంది. వివో వి 40 ప్రో భారీ 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. అయితే, వి 40 ఫోన్ 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ రెండు ఫోన్స్ కూడా Sony పవర్ ఫుల్ కెమెరాలు మరియు ZEISS ఆప్టిక్స్ తో గొప్ప కెమెరా ఫీచర్స్ ను కలిగి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ రెండు ఫోన్లు కూడా 50MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా IP 68 రేటింగ్, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లతో ఆకట్టుకుంటాయి.